తిరుమల శ్రీవారి ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవానికి భారీ స్పందన

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో తక్కువ సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే స్వామి వారి సేవలను ఆన్ లైన్ లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవ సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవానికి భారీ స్పందన
Follow us

|

Updated on: Sep 09, 2020 | 11:04 PM

Online Kalyanotsava : తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో తక్కువ సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే స్వామి వారి సేవలను ఆన్ లైన్ లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవ సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు నేరుగా కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. భక్తుల కోరిక మేరకు గత నెల 7న సేవను టీటీడీ ప్రారంభించింది.

అప్పటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 8,330 మంది భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆగస్ట్‌ 15న అత్యధికంగా ఒకే రోజు 1,012 మంది స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలతో పాటు ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పోస్టల్  శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతోంది.

అయితే  ఆన్‌లైన్‌లో కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు టికెట్‌ బుక్‌ చేసుకున్న 90 రోజుల్లోపు శ్రీవారి దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. వీరికి సుపథం ప్రవేశమార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అవకాశాన్ని ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు వినియోగించాలని టీటీడీ కోరింది.