2019 ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు.. ఏపీకి రికార్డ్

అధికారం చేపట్టడానికి రాజకీయ నాయకులు ఎంతైనా ఖర్చు పెడతారు. లెక్క ఎంతన్నది పట్టించుకోకుండా గెలవడం కోసం ఉన్నదంతా పంచుతుంటారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించారు. అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కలిసి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టడానికి సిద్ధం చేసిన బహుమతులను పట్టుకున్నారు. ఇక వీటి గురించి ఓ లెక్క తీయగా […]

2019 ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు.. ఏపీకి రికార్డ్
Follow us

|

Updated on: May 23, 2019 | 8:03 AM

అధికారం చేపట్టడానికి రాజకీయ నాయకులు ఎంతైనా ఖర్చు పెడతారు. లెక్క ఎంతన్నది పట్టించుకోకుండా గెలవడం కోసం ఉన్నదంతా పంచుతుంటారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించారు.

అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కలిసి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టడానికి సిద్ధం చేసిన బహుమతులను పట్టుకున్నారు. ఇక వీటి గురించి ఓ లెక్క తీయగా ఏపీలో కళ్ళు చెదిరే రీతిలో నగదు దొరకడం విశేషం. ఎన్నికల వేళ ఏపీలో పట్టుకున్న సొమ్ము 216.34కోట్లుగా ఈసీ ప్రకటించింది. దేశం మొత్తం  మీద ఈ ఎన్నికల వేళ 2628 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకుంటే ఏపీలో స్వాధీనం చేసుకున్న సొమ్ము అందులో పది శాతంగా ఉండడం విశేషం.  2014 ఎన్నికల్లో దొరికిన నగదు కంటే.. ఈసారి 75 కోట్లు అదనంగా దొరికిందని ఈసీ వెల్లడించింది. ఇక ఇలా భారీ మొత్తంలో నగదు దొరికినా.. మన రాజకీయ నాయకులు దొంగచాటుగా ఇంకెన్నో వందల కోట్లు జనానికి పంచారు. పైపైన చెక్ చేస్తేనే ఇన్ని కోట్లు దొరికితే ఇక సీరియస్‌గా చెక్ చేస్తే ఇంకెన్ని కోట్లు దొరుకుతాయో అని విమర్శలు కూడా వచ్చాయి.

ఏపీలో స్వాధీనం చేసుకున్న రూ.216.34 కోట్లలో 26.31 కోట్లు విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిలో విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయి కూడా ఉంది. మరోవైపు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ డబ్బు ఏరులై పారింది. ముఖ్యంగా ఏపీని మించి తమిళనాడులో భారీ మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తమిళనాడులో మొత్తం రూ.514 కోట్లు పట్టుబడగా… తెలంగాణలో రూ.77.49 కోట్లను సీజ్ చేశారు. ఇక సౌత్‌లో అత్యధిక సొమ్ము పట్టుబడిన రాష్ట్రంగా తమిళనాడు నిలవడం విశేషం.

Latest Articles
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం