AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్గో, పార్సిల్, కొరియర్ సేవల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి భారీగా ఆదాయం

కార్గో, పార్సిల్ ,కొరియర్ సేవల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. జూన్ 19, 2020 నుంచి ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో కార్గో సేవల ఆదాయం 1కోటి 57లక్షల 74వేల 598 రూపాయల వచ్చినట్టు ఆర్టీసీ గ్రేటర్ ఈడి వెంకటేశ్వర్లు వెల్లడించారు

కార్గో, పార్సిల్, కొరియర్ సేవల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి భారీగా ఆదాయం
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2020 | 9:15 PM

Share

కార్గో, పార్సిల్, కొరియర్ సేవల ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. జూన్ 19, 2020 నుంచి ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో కార్గో సేవల ఆదాయం 1కోటి 57లక్షల 74వేల 598 రూపాయల వచ్చినట్టు ఆర్టీసీ గ్రేటర్ ఈడి వెంకటేశ్వర్లు వెల్లడించారు. దీనిలో కార్గో ఆదాయం 25 లక్షల31 వేల 944 రూపాయలు కాగా… పార్శిల్ & కొరియర్ సేవల ద్వారా 1 కోటి 32 లక్షల 42 వేల 654 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.  ఆర్టీసీకి ఆదాయం పెంపొందించడమే లక్ష్యంగా కార్గో, పార్సెల్, కొరియర్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

తాజాగా  గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఈడి కార్యాలయంలో జరిగింది. దీనిలో కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్గో పార్సిల్ కొరియర్ సర్వీసులు ఆదాయం ఇంకా పెంపొందించేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పాల్గొన్నారు.

Also Read :

Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ !

రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు

Follow Us