ట్రంప్ మురికి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా భారతీయుల ఫైర్

భారత్ అంటే తనకు ప్రత్యేక అభిమానం, ప్రధాని నరేంద్రమోదీ నాకు మంచి స్నేమితుడని చెప్పుకుంటాడు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ భారత్ వాయు కాలుష్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ మురికి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా భారతీయుల ఫైర్
Balaraju Goud

|

Oct 24, 2020 | 4:48 PM

భారత్ అంటే తనకు ప్రత్యేక అభిమానం, ప్రధాని నరేంద్రమోదీ నాకు మంచి స్నేమితుడని చెప్పుకుంటాడు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇది కాస్తా ఎక్కువ చూపించుకున్నారు. భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తులు వేశాడు. భారత ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పడు భారీ సభ ఏర్పాటు చేయడం, అలాగే ఇండియా వచ్చినప్పడు కూడా అదే తరహాలో ఆహ్వానం అందుకున్నాడు ట్రంప్.

అయితే, తాజాగా మరోసారి భారత్ పై విమర్శలు చేశాడు ట్రంప్. భారత్ ను మురికి దేశంగా అభివర్ణించిన.. ఆయన ఇండియాలో స్వచ్ఛమైన గాలి లేదంటూ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబెట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. కాలుష్య కారకాలను బారత్, చైనా, రష్యా దేశాలు విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, గతంలోనూ ట్రంప్ భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో భారత్ విఫలమైందన్న ఆయన.. కొవిడ్ మరణాలను తక్కువ చేసి చూపిస్తుందంటూ వ్యాఖ్యానించారు.

అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా భారతీయులు మండిపడుతున్నారు. ‘హౌడీ మోదీ’ కార్యక్రమం వల్లే భారత్ లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చురకలంటించారు. అమెరికాతో భారత్ స్నేహం చేసినా… ట్రంప్ ఆడిపోసుకున్నారని మండిపడ్డారు. ‘‘భారత్‌లోని కోవిడ్ మరణాలపై ట్రోల్ చేశారని, భారత దేశం మురికిని గాలిలోకి పంపుతోంది, కాలుష్యం మురికిగా మారిపోయిందని, భారత్‌ను టారిఫ్ కింగ్‌గా మోదీ అభివర్ణించారని… ఇవన్నీ ‘హౌడీ మోదీ’’ ఇచ్చిన ఫలితాలని కపిల్ సిబాల్ చురకలంటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu