కోవిడ్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోవిడ్-19 పాండమిక్ కారణంగా ప్రపంచం ఇప్పుడు జటిలమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసిస్ అన్నారు. ముఖ్యంగా కొన్ని దేశాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న కొన్ని నెలలు చాలా కఠినమైనవని, ఉత్తర ప్రాంతంలోని దేశాలకు పెను ముప్పు తప్పకపోవచ్చునని ఆయన హెచ్చరించారు. మరింత జననష్టం జరగకుండా ఆయా దేశాలు తక్షణం ఆరోగ్య సంబంధ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చాలా దేశాల్లో కరోనా […]

  • Umakanth Rao
  • Publish Date - 4:33 pm, Sat, 24 October 20
కోవిడ్ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోవిడ్-19 పాండమిక్ కారణంగా ప్రపంచం ఇప్పుడు జటిలమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసిస్ అన్నారు. ముఖ్యంగా కొన్ని దేశాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న కొన్ని నెలలు చాలా కఠినమైనవని, ఉత్తర ప్రాంతంలోని దేశాలకు పెను ముప్పు తప్పకపోవచ్చునని ఆయన హెచ్చరించారు. మరింత జననష్టం జరగకుండా ఆయా దేశాలు తక్షణం ఆరోగ్య సంబంధ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చాలా దేశాల్లో కరోనా ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. స్కూళ్ల మూసివేత ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ  పరిస్థితిపై నేను గత  ఫిబ్రవరిలోనే చెప్పాను అని టెడ్రోస్ గుర్తు చేశారు. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టం కావడంలేదని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ కొనాగుతున్నాయని, కానీ వీటి పురోగతి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియవలసి ఉందని టెడ్రోస్ అన్నారు.