AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెగిటివ్ వచ్చిన మహిళకు కరోనా వార్డులో చికిత్స

గుంటూరు జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్వాకంతో ఓ మహిళకి చేసిన కరోనా పరీక్ష ఫలితం రాక ముందే పాజిటివ్‌ గా నిర్ధారించి.. కొవిడ్‌ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఫలితం వచ్చాక మెసేజ్ చూపించిన వదలలేదు. చివరికి రెండోసారి పరీక్షలోనూ నెగిటివ్ తేలడంలో తెల్లబోయారు. కరోనా బారినపడకున్నా 24 గంటల పాటు కొవిడ్ వార్డులో చికిత్సపొందింది ఆ మహిళ.

నెగిటివ్ వచ్చిన మహిళకు కరోనా వార్డులో చికిత్స
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 5:48 PM

Share

గుంటూరు జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్వాకంతో ఓ మహిళకి చేసిన కరోనా పరీక్ష ఫలితం రాక ముందే పాజిటివ్‌ గా నిర్ధారించి.. కొవిడ్‌ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఫలితం వచ్చాక మెసేజ్ చూపించిన వదలలేదు. చివరికి రెండోసారి పరీక్షలోనూ నెగిటివ్ తేలడంలో తెల్లబోయారు. కరోనా బారినపడకున్నా 24 గంటల పాటు కొవిడ్ వార్డులో చికిత్సపొందింది ఆ మహిళ.

కొల్లిపరకు చెందిన ఓ మహిళ ఈనెల 12న ఛాతిలో నొప్పి రావడంతో గుంటూరు జిల్లా ఆస్పత్రిలోని అత్యవసర వైద్యసేవల కేంద్రానికి వెళ్లింది. దీంతో అమెను పరీక్షించిన వైద్య సిబ్బంది అత్యవసర పరీక్షలు చేయించారు. అటు కరోనా అనుమానంతో అక్కడి వైద్య సిబ్బంది సూచనల మేరకు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని స్వాబ్‌ పరీక్ష చేయించారు. ఇక ఫలితం రావడానికి టైము పడుతుండడంతో ఆ మహిళ కరోనా వార్డు ఓపీ విభాగానికి పంపించి చికిత్స మొదలు పెట్టారు. ఆ మహిళకు ఈ నెల 16న మరోసారి స్వాబ్‌ పరీక్ష చేయించారు. ఇది జరిగిన ఓ గంట తరవాత కొల్లిపరలో ఇదివరకు చేయించుకున్న పరీక్షలో నెగిటివ్‌ అని నిర్థారణ అయిందని ఆమె సెల్ ఫోన్ నంబరుకు మెసేజ్ వచ్చింది. ఈ మేరకు తన వచ్చిన మెసేజ్ ను వైద్య సిబ్బందికి చూపించింది మహిళ. అయినా సరే కొవిడ్‌ వార్డులోకి వెళ్లాల్సిందేనని అనడంతో అక్కడ చేరిపోయింది. రెండో సారి జిల్లా ఆస్పత్రిలో చేయించిన పరీక్షలోనూ నెగిటివ్‌ అని నిర్ధరణ అయిందనే మెసేజ్ 17న మధ్యాహ్నం ఆమెకు వచ్చింది. దాన్ని ఆస్పత్రి సిబ్బందికి చూపించగా ఆన్‌లైన్‌లో పరిశీలించి వాస్తవమని తేల్చారు. సిబ్బంది నిర్వాకం వల్ల కొవిడ్‌ వార్డులోని బాధితుల మధ్య దాదాపు 24 గంటలు గడపాల్సి వచ్చింది ఆ మహిళ. ఈ వ్యవహారం మొత్తాన్ని ఆస్పత్రి సూపరిండెంట్ ని కలసి జరిగిందంతా వివరించారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి ఇందుకు బాధ్యలైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.