ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్.. అలా చేస్తే వేటు తప్పదు..!

కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో స్టడీ మెటీరియల్స్‌, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ

ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్.. అలా చేస్తే వేటు తప్పదు..!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 6:52 PM

కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో స్టడీ మెటీరియల్స్‌, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలపై ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మొయిల్‌ ద్వారా లేదా వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒత్తిడి చేసే కాలేజీలపై ourbiep@gmail.comకు ఈమెయిల్ ద్వారా, 9393282578 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. మహమ్మారి వ్యాప్తి ఈనేపథ్యంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్‌ సమాచారాన్ని బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!