ఇన్ఫోసిస్‌కు హోం శాఖ షాక్!

విదేశీ నిధులు పొందేందుకు అవసరమైన నియమాలను ఉల్లంఘించిన కేసులో చర్యలు చేపడుతూ ఎన్జీవో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర  హోమ్ మంత్రిత్వశాఖ రద్దు చేసింది. బెంగుళూరుకి చెందిన ఈ సంస్థపై చర్యలు చేపట్టినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. విదేశాల నుంచి సహాయం పొందే ఎన్జీవోలు విదేశీ విరాళాలు చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) క్రింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి విరాళాలకు సంబంధించిన  లెక్కలను ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ప్రభుత్వానికి నివేధించాలి. బ్యాలెన్స్ షీట్  […]

ఇన్ఫోసిస్‌కు హోం శాఖ షాక్!
Follow us

|

Updated on: May 13, 2019 | 4:10 PM

విదేశీ నిధులు పొందేందుకు అవసరమైన నియమాలను ఉల్లంఘించిన కేసులో చర్యలు చేపడుతూ ఎన్జీవో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర  హోమ్ మంత్రిత్వశాఖ రద్దు చేసింది. బెంగుళూరుకి చెందిన ఈ సంస్థపై చర్యలు చేపట్టినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. విదేశాల నుంచి సహాయం పొందే ఎన్జీవోలు విదేశీ విరాళాలు చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) క్రింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి విరాళాలకు సంబంధించిన  లెక్కలను ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ప్రభుత్వానికి నివేధించాలి. బ్యాలెన్స్ షీట్  కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఏడాదిలో విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు రాకపోయినా నిల్ రిటర్నులు దాఖలు చేయాలి. అయితే ఇన్ఫోసిస్ గత ఆరేళ్లుగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో గతేడాది కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. పదే పదే రిమైండర్ లేఖలు జారీ చేసినప్పటికీ తగిన వివరణ ఇవ్వకపోవడంతో ఈ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దుపై ఇన్ఫోసిస్ స్పందించింది. ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేసింది. అయితే 2016లో ఫెరాలో చేసిన సవరణల మేరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆ చట్టం పరిధిలోకి రాదని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సుధామూర్తి ఛైర్ పర్సన్‌గా ఉన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను 1996లో స్థాపించారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ