రెండు సంవ‌త్స‌రాల చిన్నారికి కిడ్నీ ఫెయిల్యూర్ : ఆ ద‌గ్గు మందే కార‌ణ‌మ‌ట‌

హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా పనిచేసే మెడిసిన్ త‌యారీ సంస్థ‌ డిజిటల్ విజన్ మరోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. ఈసారి కలుషితమైన దగ్గు సిరప్‌ను విక్రయించినట్లు స‌ద‌రు సంస్థ‌పై ఆరోపణలు వచ్చాయి.

రెండు సంవ‌త్స‌రాల చిన్నారికి కిడ్నీ ఫెయిల్యూర్ : ఆ ద‌గ్గు మందే కార‌ణ‌మ‌ట‌
Follow us

|

Updated on: Aug 10, 2020 | 4:25 PM

Cough syrup causes for kidney failure : హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా పనిచేసే మెడిసిన్ త‌యారీ సంస్థ‌ డిజిటల్ విజన్ మరోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. ఈసారి కలుషితమైన దగ్గు సిరప్‌ను విక్రయించినట్లు స‌ద‌రు సంస్థ‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ సిర‌ప్ ప్ర‌భావం రెండేళ్ల చిన్నారిలో మూత్రపిండాల వైఫల్యానికి దారితీసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సంస్థ‌ దగ్గు సిరప్ బ్రాండ్.. కోఫ్‌సెట్ ఏటి, మూత్రపిండాల వైఫల్యంతో పాటు న్యూరోలాజికల్ టాక్సిసిటీకి కారణమయ్యే రసాయనమైన డైథిలీన్ గ్లైకాల్ (డిఇజి) తో కలుషితమైందని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) తెలిపింది. దీనిపై వెంట‌నే స్పందించిన‌ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో), దేశవ్యాప్తంగా ఈ సిర‌ప్ నమూనాలను తనిఖీ చేయ్యాల‌ని, దాని అమ్మకాలను నిలిపివేయాల‌ని డ్ర‌గ్ డీల‌ర్ల‌ను కోరింది. పీజీఐ చంఢీగ‌డ్ నుంచి ఓ ఫిర్యాదు వ‌చ్చిన నేప‌థ్యంలో సిడిస్కో ఈ చ‌ర్య‌లు ప్రారంభించింది. అక్కడ కోఫ్‌సెట్ ఏటి వాడకం వల్ల రెండేళ్ల బాలిక మూత్రపిండ (కిడ్నీ) ​​వైఫల్యానికి గురైంది. పిల్లలలో కిడ్నీ ఫెయిల్యూర్ సాధారణంగా కనిపించదు.

కాగా ఈ డిజిటల్ విజ‌న్ సంస్థ‌పై  హిమాచ‌ల్ ప్ర‌భుత్వం గ‌తంలో కేసు న‌మోదు చేసింది. గ‌త ఫిబ్రవరిలో కలుషితమైన దగ్గు సిరప్ ‘కోల్డ్ బెస్ట్-పిసి’ అమ్మినందుకు కేసు బుక్ చేసింది. ఈ సిర‌ప్ వాడ‌టం వ‌ల‌న‌ అప్పట్లో జమ్మూ & కాశ్మీర్లో తొమ్మిది మంది శిశువులు, హర్యానాలో ఒకరు మరణించారు.

Also Read : బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు