AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి
Balaraju Goud
|

Updated on: Aug 10, 2020 | 4:17 PM

Share

కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కటేమిటి అన్ని వర్గాలపై కొవిడ్‌-19 తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ప్రతి వ్యక్తి జీవన శైలినే మార్చివేసింది. కరోనా రాకాసి బతుకు చిత్రాన్నే మార్చేసింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

నల్లగొండ జిల్లా హాలియాలోని అక్షయ హై స్కూల్ లాక్ డౌన్ కారణంగా మూతపడింది. దీంతో ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాల యాజమాన్యం ఆదాయం లేక సరిగా జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎక్కలూరి సాయి సాత్విక్ రెడ్డికి విషయం తెలిసింది. ఉపాధ్యాయులకు ఎంతో కొంత సాయం అందించాలనుకున్నాడు. దీంతో తన తండ్రి హాలియా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డికి వివరించాడు. దీంతో కొడుకు ఆలోచనను మెచ్చకున్న శ్రీనివాస్ రెడ్డి ఇందుకు అంగీకరించాడు. పాఠశాలలోని 21 మంది ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల రైస్, కిరాణా సామాగ్రి, శానిటైజర్ తో పాటు మాస్కులు అందించారు.

నేటికీ పాఠశాలలు పునఃప్రారంభం కానందున ప్రైవేట్ టీచర్స్ మనుగడను దృష్టిలో ఉంచుకొని తన కుమారుని కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలోని ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీచర్స్ ను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..