న్యూ ట్రాఫిక్ రూల్స్.. పాటించకపోతే ఖతమే..!

ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. భరత్ అనే నేను సినిమాలోని సీన్‌ని రియల్ చేయనుంది. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ జరిమానా విధించనుంది. సెప్టెంబర్ 1 నుంచే వాటిని చట్ట ప్రకారం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయలు, సీటు బెల్డు పెట్టుకోకుంటే రూ. 1000.. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ. 5 వేలు.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:21 pm, Thu, 22 August 19
న్యూ ట్రాఫిక్ రూల్స్.. పాటించకపోతే ఖతమే..!

ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. భరత్ అనే నేను సినిమాలోని సీన్‌ని రియల్ చేయనుంది. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ జరిమానా విధించనుంది. సెప్టెంబర్ 1 నుంచే వాటిని చట్ట ప్రకారం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయలు, సీటు బెల్డు పెట్టుకోకుంటే రూ. 1000.. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ. 5 వేలు.. రాంగ్ రూట్ లో వేళితే రూ. 5వేలు.. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏకంగా 10 వేల రూపాయలు జరిమానా విధించనున్నారు. వీటికే కాదు.. ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే కూడా భారీ జరిమానా వసూలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఇన్య్సూరెన్స్ లేకుంటే వెయ్యి రూపాయిలు జరిమానా విధించే వారు. ఇప్పుడు అది కాస్తా రూ.2వేలకు పెంచారు. ఏదేమైనా సెప్టెంబరు ఒకటి తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి భారీ మోత ఖాయమని తెలుస్తోంది.