బ్రేకింగ్: 6 వేల ఇళ్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: గత ప్రభుత్వంలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 6,032 ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వేల ఇళ్లు, విశాఖపట్నం జిల్లా చోడవరంలో 3,936, కృష్ణా జిల్లా కురుమద్దాలిలో 96 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. వివిధ కారణాలతో అవసరమైన భూమి అప్పగించకపోవడం, ప్రాజెక్టు చేపట్టేందుకు భూమి లభ్యత లేకపోవడం, టెండర్లు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో ఈ ఇళ్లను రద్దు […]
అమరావతి: గత ప్రభుత్వంలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 6,032 ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వేల ఇళ్లు, విశాఖపట్నం జిల్లా చోడవరంలో 3,936, కృష్ణా జిల్లా కురుమద్దాలిలో 96 ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఆదేశాల్లో పేర్కొంది. వివిధ కారణాలతో అవసరమైన భూమి అప్పగించకపోవడం, ప్రాజెక్టు చేపట్టేందుకు భూమి లభ్యత లేకపోవడం, టెండర్లు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో ఈ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగుచర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.