Breaking: డా.రమేష్ బాబుకు ఊరట : తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు
స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిగింది.
స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న దర్శాసనం డాక్టర్ రమేష్ కుమార్ తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు కామెంట్స్ చేసింది. ఏళ్ల తరబడి హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ధర్మాసనం..అక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహణకు అనుమతి ఇచ్చిందే అధికారులు కాదా అని అడిగింది. అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎమ్‌హెచ్ఓ కూడా ప్రమాదానికి బాధ్యులే కదా ప్రశ్నించింది.
కేసులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులను నిందితులుగా చేరుస్తారా అని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. డాక్టర్ రమేష్ బాబును అరెస్ట్ చేయకుండా ఉంటారా….లేక తామే ఉత్తర్వులు ఇవ్వాలా అని న్యాయమూర్తి అడగడంతో, కేసు ఇంకా విచారణ దశలోనే ఉందన్న ప్రభుత్వ తరుపు న్యాయవాది వివరణ ఇచ్చారు.
Also Read :
పబ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీలతో రెండు కుటుంబాల ఘర్షణ