లోకనాయకుడి కుమార్తెను నేనెందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్‌పై శృతి ఫోకస్
కొంత మంది హీరోయిన్లు భిన్నమైన రూట్లో ముందుకు వెళ్తారు. వాళ్లకు డిమాండ్ లేకపోయినా.. వాళ్ల మేకర్స్ ముందు పెట్టే డిమాండ్స్‌కు మాత్రం అంతే ఉండదు.
కొంత మంది హీరోయిన్లు భిన్నమైన రూట్లో ముందుకు వెళ్తారు. వాళ్లకు డిమాండ్ లేకపోయినా.. వాళ్ల మేకర్స్ ముందు పెట్టే డిమాండ్స్‌కు మాత్రం అంతే ఉండదు. ప్రజెంట్ సౌత్‌లో ఓ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? ఇంకెవరండి.. యూనివర్సల్ స్టార్ వారసురాలు శృతి హాసన్. అవును నిజమే.. శృతి తన డిమాండ్‌లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారట. లాంగ్ బ్రేక్ తరువాత అమ్మడికి అవకాశాలు ఇవ్వటమే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తుంటే.. ఈ బ్యూటీ మాత్రం భారీ పేమెంట్ ఇస్తేనే అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌కే కాదు.. గెస్ట్ రోల్ అయినా పేమెంట్ మాత్రం ఫుల్లుగానే ఉండాలంటున్నారు శృతి.
సీనియర్ హీరోలకు గ్లామరస్ బ్యూటీస్ దొరకటం ఇబ్బందిగా ఉండటంతో శృతి డిమాండ్‌లు కూడా చెల్లిపోతున్నాయి. వకీల్ సాబ్ విషయంలో ఇలాగే పంతం నెగ్గించుకున్నారు శృతి హాసన్. గెస్ట్ రోలే కదా కాస్త పేమెంట్ తగ్గించుకొమ్మన్నా.. నో కాంప్రమైజ్ అనేశారు. ఇంకేం చేస్తారు చెప్పండి. అమ్మడు అడిగినంతా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
Also Read :
హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు.. ముగ్గురు దుర్మరణం
శ్రీవారి భక్తులకు శుభవార్త, వర్చువల్ సేవా టికెట్లు విడుదల, రోజుకు ఎన్నో తెలుసా..?