‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనపై హీరో రామ్ మరో సంచలన ట్వీట్ చేశాడు. ''చట్టంపై నాకు పూర్తి నమ్మకముంది. అసలైన కుట్రదారులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.

కుట్రదారులకు శిక్ష తప్పదు: హీరో రామ్

Updated on: Aug 16, 2020 | 3:38 PM

Hero Ram Another Sensational Tweet: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనపై హీరో రామ్ మరో సంచలన ట్వీట్ చేశాడు. ”చట్టంపై నాకు పూర్తి నమ్మకముంది. అసలైన కుట్రదారులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇకపై ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయను” అని హీరో రామ్ పేర్కొన్నాడు.

కాగా, హీరో రామ్ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వరుసగా పలు సంచలన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ”పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ” రామ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారంటూ.. స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ కంటే ముందు ప్రభుత్వమే కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిందని పేర్కొన్నాడు.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్