అవును ఆ యాక్సిడెంట్ చేసింది నేనే..!
24 గంటల యాక్సిడెంట్ హైడ్రామాకి తెరపడింది. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అంటూ.. ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు హీరో రాజ్ తరుణ్. అది డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్ అని.. దాదాపుగా అక్కడ 3 నెలల నుంచి యాక్సిడెంట్స్ అవుతున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలాగే.. సడన్ టర్నింగ్ ఉండడంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది తప్ప నేనేం డ్రింక్ చేసి పారిపోలేదని చెప్పుకొచ్చాడు. గోడను ఢీ కొట్టిన తర్వాత.. చాలా పెద్ద శబ్ధం వచ్చిందని.. దాంతో నాకు చెవులు […]

24 గంటల యాక్సిడెంట్ హైడ్రామాకి తెరపడింది. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అంటూ.. ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు హీరో రాజ్ తరుణ్. అది డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్ అని.. దాదాపుగా అక్కడ 3 నెలల నుంచి యాక్సిడెంట్స్ అవుతున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలాగే.. సడన్ టర్నింగ్ ఉండడంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది తప్ప నేనేం డ్రింక్ చేసి పారిపోలేదని చెప్పుకొచ్చాడు. గోడను ఢీ కొట్టిన తర్వాత.. చాలా పెద్ద శబ్ధం వచ్చిందని.. దాంతో నాకు చెవులు మూసుకుపోయాయని.. గుండె దడ పెరిగిందని.. ఏం చేయాలో తెలియక.. కారు వెంటనే అక్కడ వదిలేసి పరిగెట్టానని తెలిపాడు రాజ్. కాగా.. సహాయం కోసం ఓ ఇంటి వైపు పరిగెత్తానని.. మా ఇంటికి దగ్గర్లోనే ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని ట్వీట్‌లో చెప్పాడు తరుణ్. కాగా.. నాపై కన్సన్‌తో నాకు చాలా మంది ఫోన్ కాల్స్ చేశారని.. వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం నేను రెస్ట్ తీసుకుంటున్నా.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటా అంటూ చెప్పాడు హీరో రాజ్ తరుణ్.
#iamsafe #seatbeltsavedme#wearseatbelt pic.twitter.com/v7yM2uuar4
— Raj Tarun (@itsRajTarun) August 21, 2019