హీరో ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా హీరో ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్లపై రూ.5,000 నగదు డిస్కౌంట్‌తో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. 

  • Ram Naramaneni
  • Publish Date - 4:28 pm, Tue, 3 November 20
హీరో ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా హీరో ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్లపై రూ.5,000 నగదు డిస్కౌంట్‌తో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.  వినియోగదార్లు తమ పాత టూ వీలర్ మార్పిడి చేసుకోవడం ద్వారా మరో రూ.5,000 అదనపు డిస్కౌంట్ లేదంటే వడ్డీ రహిత ఫైనాన్స్‌ (ఎంపిక చేసిన ఏరియాలలో) పొందే ఛాన్స్ కల్పించినట్లు పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ లిథియం-అయాన్‌, లెడ్‌-యాసిడ్‌ మోడల్ ఇ-స్కూటర్లకు వర్తిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 500 డీలర్ల వద్ద ఈ నెల 14 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ప్రకటించింది. లెడ్‌-యాసిడ్‌ మోడళ్లపై రూ.3,000 డిస్కౌంట్, ఇతర మోడళ్లపై రూ.5,000 వరకు నగదు డిస్కౌంట్ పొందవచ్చని వివరించింది. రిఫరల్‌ స్కీమ్‌లో భాగంగా కొనుగోలు చేసే వినియోగదార్లకు అదనంగా మరో రూ.1,000 బెనిఫిట్స్ ఉంటాయని పేర్కొంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆప్టిమా హెచ్‌ఎక్స్‌ సిటీ స్పీడ్‌, నిక్స్‌ హెచ్‌ఎక్స్‌ సిటీ స్పీడ్‌లు ఈ ఆఫర్‌ పరిధిలోకి రావని స్పష్టం చేసింది.

Also Read :

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !

భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్