Milk: ఆవు పాలలో ఉన్నదేంటి? గేదె పాలలో లేనిదేంటి? రెండింటికీ తేడా తెలిస్తే షాక్ అవుతారు..

పాలల్లో సాధారణంగా మనకు రెండు రకాల పాలు కనిపిస్తాయి. ఒకటి గేదె పాలు, మరొకటి ఆవు పాలు. ఈ రెండు రకాల పాలను తాగే వారు ఉన్నారు. రెండూ ఆరోగ్యానికి మంచిదనే చాలా మంది చెబుతారు. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది?

Milk: ఆవు పాలలో ఉన్నదేంటి? గేదె పాలలో లేనిదేంటి? రెండింటికీ తేడా తెలిస్తే షాక్ అవుతారు..
Cow Milk Vs Buffalo milk
Follow us
Madhu

|

Updated on: Apr 05, 2023 | 5:00 PM

పాలు ఆరోగ్యానికి నాలుగు విధాలా మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. పాలల్లో అధిక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలకు, పళ్ల ధృడత్వానికి అవసరమైన కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి రోజూ పాల తాగమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే పాలల్లో సాధారణంగా మనకు రెండు రకాల పాలు కనిపిస్తాయి. ఒకటి గేదె పాలు, మరొకటి ఆవు పాలు. ఈ రెండు రకాల పాలను తాగే వారు ఉన్నారు. రెండూ ఆరోగ్యానికి మంచిదనే చాలా మంది చెబుతారు. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది? అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి? రెండింటినీ ఎలా విభజించాలి? రెండింటిలో దేనిలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి? దేనిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

కొవ్వు.. పాలలో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవు పాలతో పోల్చుకుంటే.. గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలు లో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుండి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీనితో గేదె పాలు జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఎక్కువ సమయం మీకు ఆకలి లేకుండా చేస్తుంది.

​నీళ్లు.. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు కనుక మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఆవు పాలని ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురై పోకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

​ప్రోటీన్స్.. ఇక మనం ప్రోటీన్ల విషయానికి వస్తే.. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటం వల్ల శిశువులు, పెద్దవాళ్ళకి గేదె పాలను ఇవ్వడం అంత మంచిది కాదు.

కొలెస్ట్రాల్.. ఇక కొలెస్ట్రాల్ విషయంలోకి వస్తే… రెండు రకాల పాలల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా వేరేగా ఉన్నాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పీసీఓడీ, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకీ మంచిది. కాబట్టి దీనిని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది.

​క్యాలరీలు.. గేదె పాలలో క్యాలరీలు సమృద్దిగా ఉంటాయి ఎందుకంటే గేదె పాలలో కొవ్వుపదార్ధాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.

ప్రిజర్వేషన్.. గేదె పాలను ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడానికి వీలు అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే గేదె పాలలో హై పెరోక్సిడైజ్ యాక్టివిటీ ఉంటుంది అంటే ఇది ఒక ఎంజైమ్ లాంటిది. అదే ఆవు పాలని ఎక్కువ కాలం ఉంచలేము. వాటిని ఒకటి లేదా రెండు రోజులలో తాగేయాలి.

​రంగు.. గేదె పాలు వైట్ క్రీమ్ కలర్‌లో ఉంటే ఆవు పాలు కాస్త ఎల్లోయిష్ గా ఉంటాయి. గేదె పాలలో బీటా-కెరోటిన్ పిగ్మెంట్ రంగుని లేకుండా చేస్తుంది. ఆవు పాలలో విటమిన్ ఏ ఉండడం వల్ల కాస్త పసుపు రంగు ఉంటుంది.

ఈ తేడాలు గమనించండి..

  • మీరు చక్కగా నిద్ర పోవాలంటే ఖచ్చితంగా గేదె పాలని ప్రిఫర్ చేయండి. అదే విధంగా కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి వంటి వాటిని తయారు చేసుకోవడానికి కూడా గేదె పాలే మంచిది.
  • అదే ఒకవేళ మీరు స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలని ఎంపిక చేసుకోవడం మంచిది. అయితే రెండు పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే.
  • అయితే ఇక్కడ ఉన్న తేడాలను బట్టి మీకు ఏది బెస్ట్ ఓ చూసుకొని తాగండి. కానీ ప్రతిరోజూ పాలను తాగడం మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..