ప్రమాణపత్రం దాఖలు చేయండి: హైకోర్టు

తనపై అభ్యంతరకరమైన ఆరోపణలతో కేసు నమోదు చేయడం పై లక్ష్మీపార్వతి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు, ఆమె పై ఫిర్యాదు చేసిన కోటికి నోటీసులు జారీ చేస్తూ.. కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారంటూ.. కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. […]

ప్రమాణపత్రం దాఖలు చేయండి: హైకోర్టు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 4:46 PM

తనపై అభ్యంతరకరమైన ఆరోపణలతో కేసు నమోదు చేయడం పై లక్ష్మీపార్వతి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు, ఆమె పై ఫిర్యాదు చేసిన కోటికి నోటీసులు జారీ చేస్తూ.. కేసుకు సంబంధించిన వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారంటూ.. కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండలో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయటంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, కేసును సీఐడీకి అప్పగిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటీషనర్ పేర్కొన్నారు.