రోడ్డు పక్కన బెంచీ కింద మొసలి.. భయంతో జనం పరుగులు

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జీవరాసులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగాగుజరాత్‌లోని వడోదరాలో రోడ్డుపక్కన ఓ మొసలి కలకలం సృష్టించింది. దాదాపు ఐదు అడుగుల పొడవున్న ఓ మొసలి ఆదివారం గ్రామంలో దర్శనమిచ్చి స్థానికులను షాక్‌కు గురిచేసింది.

రోడ్డు పక్కన బెంచీ కింద మొసలి.. భయంతో జనం పరుగులు
Follow us

|

Updated on: Aug 16, 2020 | 7:04 PM

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జీవరాసులు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగాగుజరాత్‌లోని వడోదరాలో రోడ్డుపక్కన ఓ మొసలి కలకలం సృష్టించింది. దాదాపు ఐదు అడుగుల పొడవున్న ఓ మొసలి ఆదివారం గ్రామంలో దర్శనమిచ్చి స్థానికులను షాక్‌కు గురిచేసింది. వడోదరలోని కళా భవన్‌కు సమీపంలో రాజ్‌మహల్ రోడ్డు పక్క బాటసారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ కింద ఓ మొసలి నక్కింది. అటు వైపుగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి కండపడింది ఈ మొసలి. దీంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో గుజరాత్ సొసైటీ ఫర్ ప్రొవెన్షన్ ఆఫ్ క్యుయాల్టీ టు అనిమల్స్ వాలంటీర్లు ఆ మొసలిని బంధించారు. వాలంటీర్లు దాన్ని బంధించి స్థానిక మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

రాత్రి వేళ సమీపంలోని విశ్వమిత్ర నది నుంచి బయటకొచ్చి…రోడ్డుపై పాకుతూ అక్కడికి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. జనావాసాల మధ్యలోకి మొసళ్లు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటి కుంటలను ఆవాసంగా మార్చుకున్న మొసళ్లు…భారీ వర్షాలు, వరదల కారణంగా ఇలా బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

Latest Articles
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేస్తున్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
IPL 2024: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య..
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
ఏ క్యారెట్‌ బంగానికి ఎక్కువ రాబడి వస్తుంది?
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే