డ్రైవర్లు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి..లేదంటే డేంజరే..
గూడ్స్ రవాణా చేసే లారీ సహా ఇతర వాహనాల డ్రైవర్లకు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపై జాగ్రత్తలు సూచించారు ఏపీ డీటీసీ వెంకటేశ్వరరావు. కోవిడ్-19 బారిన పడకుండా…ప్రభుత్వం ఇచ్చిన సూచనలను డ్రైవర్లకు వివరించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధి నుంచి దూరంగా ఉంటామని తెలిపారు. వాహనం క్యాబిన్ లోపల, బయట ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో క్లీన్ చేసుకోవాలని వివరించారు. మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు తప్పనిసరి ధరించాలని పేర్కొన్నారు. జనం ఎక్కువగా ఉండే […]

గూడ్స్ రవాణా చేసే లారీ సహా ఇతర వాహనాల డ్రైవర్లకు కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపై జాగ్రత్తలు సూచించారు ఏపీ డీటీసీ వెంకటేశ్వరరావు. కోవిడ్-19 బారిన పడకుండా…ప్రభుత్వం ఇచ్చిన సూచనలను డ్రైవర్లకు వివరించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధి నుంచి దూరంగా ఉంటామని తెలిపారు. వాహనం క్యాబిన్ లోపల, బయట ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో క్లీన్ చేసుకోవాలని వివరించారు. మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు తప్పనిసరి ధరించాలని పేర్కొన్నారు.
జనం ఎక్కువగా ఉండే దాబాల్లో ఆహారం సేవించడం కన్నా .. పార్సిల్ తీసుకుని వెళ్లి ఏకాంత ప్రదేశాల్లో తినాలని పేర్కొన్నారు. గూడ్స్ వాహనాల క్యాబిన్ లో ఇతర వ్యక్తులను అస్సలు ఎక్కించుకోకూడదని హెచ్చరించారు. చెక్ పోస్ట్ లు, టోల్ గేట్లు, పెట్రోల్ బంకులు, భోజన హోటల్స్ వద్ద డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పద్దతిలో చెల్లింపులు జరపాలని, కరెన్సీ నోట్లు ఉపయోగించడం సాధ్యమైనంతవరకు మానేయ్యాలని కోరారు. డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు…కాళ్లు, చేతులు శుభ్రపరుచుకుని… వేసుకున్న దుస్తులు వదిలి స్నానం చేసిన అనంతరం ఇంట్లోకి ప్రవేశించాలన్నారు. మళ్లీ విధులకు వెళ్లేవరకు బయట తిరుగటం, బంధువులు, స్నేహితులను కలవటం లాంటివి చేయకూడదన్నారు. పొడిదగ్గు, జ్వరం లాంటి సంకేతాలు కనిపిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.




