ఇండియన్ ఇఫ్తార్ పార్టీలో పాకిస్తాన్ ‘ కుతంత్రం ‘

రంజాన్ మాసంలో ముస్లిములకు అతి ముఖ్యమైన ఇఫ్తార్ ను కూడా పాకిస్తాన్ ‘ కుతంత్ర రాజకీయం ‘ చేయడం భారత నేతలను ఆశ్చర్య పరిచింది. పాక్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ లోని హోటల్ సెరెనాలో పాక్ లోని భారత హైకమిషనర్ అజయ్ బసారియా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు రసాభాసగా ముగిసింది. ఈ విందుకు ఆహ్వానించినవారిని పాక్ అధికారులు భయపెట్టి అక్కడినుంచి పంపివేశారు. ఈ హోటల్ ను చుట్టుముట్టిన వారు-వందలాది గెస్టులను వేధించారని, […]

ఇండియన్ ఇఫ్తార్ పార్టీలో  పాకిస్తాన్ ' కుతంత్రం '
Follow us

|

Updated on: Jun 02, 2019 | 11:10 AM

రంజాన్ మాసంలో ముస్లిములకు అతి ముఖ్యమైన ఇఫ్తార్ ను కూడా పాకిస్తాన్ ‘ కుతంత్ర రాజకీయం ‘ చేయడం భారత నేతలను ఆశ్చర్య పరిచింది. పాక్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ లోని హోటల్ సెరెనాలో పాక్ లోని భారత హైకమిషనర్ అజయ్ బసారియా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు రసాభాసగా ముగిసింది. ఈ విందుకు ఆహ్వానించినవారిని పాక్ అధికారులు భయపెట్టి అక్కడినుంచి పంపివేశారు. ఈ హోటల్ ను చుట్టుముట్టిన వారు-వందలాది గెస్టులను వేధించారని, తక్షణమే అక్కడినుంచి వెళ్లిపోవలసిందిగా ఆదేశించారని ఆయన తెలిపారు. ఈ అతిథులకు క్షమాపణ చెబుతున్నామని, ఇలాంటి పాక్ కుతంత్రాలు చాలా ఆవేదన కలిగించాయని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ విధమైన చర్యలు భారత, పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీస్తాయన్నారు. ఇది దౌత్య సంబంధ నిబంధనలను అతిక్రమించేదిగా ఉంది. అని బసారియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఇలా వ్యవహరించడం ఇది రెండో సారి. గత నెలలో లాహోర్ సమీపంలోని గురుద్వారా వద్ద కొంతమంది సిక్కు యాత్రికులకు వసతి ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు దౌత్యాధికారులను పాక్ అధికారులు 20 నిముషాలసేపు ఓ గదిలో నిర్బంధించారు. మళ్ళీ ఈ ప్రాంతంలో ఇలాంటివి ఏర్పాటు చేయరాదని వారిని బెదిరించారు. అయితే ఢిల్లీ లో ఈ వారం మొదట్లో పాకిస్తాన్ హైకమిషనర్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు అనేకమంది భారత ప్రముఖులు, ఆర్టిస్టులు, రైటర్లు హాజరయ్యారు.