Surabi Medical College : సిద్ధిపేట మెడికల్ కాలేజ్ అడ్మిషన్ల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Surabi Medical College : సిద్ధిపేటలో గతేడాది ప్రారంభమైన సురభి ప్రైవేటు మెడికల్ కాలేజ్‌కు కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి నిరాకరించిన
Surabi Medical College : సిద్ధిపేటలో గతేడాది ప్రారంభమైన సురభి ప్రైవేటు మెడికల్ కాలేజ్‌కు కొత్తగా అడ్మిషన్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. గతేడాది ఎలాంటి సమస్యలు లేకుండా అడ్మిషన్లు పూర్తయ్యాయి. కానీ ఈ సంవత్సరం రెన్యూవల్ సమయంలో కళాశాలలో తగిన సౌకర్యాలు లేవన్న కారణంగా అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో కళాశాల యాజమాన్యం న్యాయస్థానాలను ఆశ్రయించింది.
ఇటీవల వెలువడిన తీర్పుతో కొత్త సంవత్సరం మొదటి రోజునే రెన్యూవల్ లభించింది. దీంతో వంద మంది విద్యార్థులకు అడ్మిషన్ పొందడానికి మార్గం ఏర్పడింది.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో 4940 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కళాశాలకు వంద సీట్లకు అనుమతి రావడంతో అదనంగా సమకూరినట్లయింది. ఈ వంద సీట్లలో యాభై కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయి. వివిధ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద చేరి మధ్యలోనే వదిలేసిన సీట్లు దాదాపు పాతిక ఉన్నాయి. ఈ రెండింటికీ కలిపి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్లను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.