దేశవ్యాప్తంగా 4.39 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేత!

అర్హత లేకున్నా తప్పుడు మార్గాల ద్వారా రేషన్ కార్డు పొంది..ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందుతోన్న వాళ్లపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా 4.39 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేత!
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2020 | 7:07 PM

అర్హత లేకున్నా తప్పుడు మార్గాల ద్వారా రేషన్ కార్డు పొంది..ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందుతోన్న వాళ్లపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో  గడిచిన ఏడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 4.39కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించింది. 2013 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఆయా స్టేట్ గవర్నమెంట్స్ 4.39కోట్ల  బోగస్‌ రేషన్ కార్డులను ఏరివేసినట్లు తెలిపింది. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా టెక్నాలజీ విస్తృతంగా వినియోగిస్తూ..విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర వినియోగదారుల, ఆహార మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో భాగంగా లబ్దిదారుల సమాచారాన్ని ఆధునీకరించినట్లు పేర్కొంది. వీటిని ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా అనర్హత, బోగస్‌ రేషన్‌ కార్డులను ఏరివేత సులభతరం అయ్యిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా వీటి ద్వారా మరణించిన వారితో పాటు రెండు కార్డులు ఉన్నవారు, వలస వెళ్లిన వారి కార్డులను కూడా తొలగించడం సాధ్యమయిందని కేంద్రం అభిప్రాయపడింది. జాతీయ ఆహార భద్రత చట్టం  అమలులో భాగంగా కేవలం అర్హులైన లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చేందుకు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపింది. ఇక, అర్హులైన లబ్దిదారులకు ఈ రేషన్‌ కార్డులను ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించింది. ఇక ప్రస్తుతం లబ్దిదారులు  ఏ రాష్ట్రంలోనైనా రేషన్‌ తీసుకునే విధంగా ‘ఒకే దేశం-ఒకే రేషన్‌కార్డు’ విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తోన్న విషయం తెలిసిందే.

Also Read :

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

 ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఏసీ కూడా అక్కర్లేదట !