లాక్​డౌన్ స‌మ‌యంలో చిన్నారులు, మహిళలపై పెరిగిన‌ వేధింపులు

లాక్​డౌన్ స‌మ‌యంలో చిన్నారులు, మహిళలపై పెరిగిన‌ వేధింపులు

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశమంతా లాక్​డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై వేధింప‌ల ప‌ర్వం అధిక‌మవ్వ‌డం గ‌మ‌నార్హం. మొదటి 11 రోజుల లాక్​డౌన్ పిరియ‌డ్ లో హింస, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ 92 వేల కాల్స్ వచ్చినట్లు చైల్డ్​లైన్ ఇండియా సంస్థ పేర్కొంది. భారత ప్రభుత్వం చిన్నారుల రక్షణ కోసం 1098 నంబరుతో చైల్డ్​ హెల్ప్​లైన్​ను ర‌న్ చేస్తోంది. ఈ నంబర్​కు మార్చి 20 నుంచి మార్చి 31 మధ్య కాలంలో […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 4:35 PM

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశమంతా లాక్​డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై వేధింప‌ల ప‌ర్వం అధిక‌మవ్వ‌డం గ‌మ‌నార్హం. మొదటి 11 రోజుల లాక్​డౌన్ పిరియ‌డ్ లో హింస, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ 92 వేల కాల్స్ వచ్చినట్లు చైల్డ్​లైన్ ఇండియా సంస్థ పేర్కొంది. భారత ప్రభుత్వం చిన్నారుల రక్షణ కోసం 1098 నంబరుతో చైల్డ్​ హెల్ప్​లైన్​ను ర‌న్ చేస్తోంది. ఈ నంబర్​కు మార్చి 20 నుంచి మార్చి 31 మధ్య కాలంలో 3.07 లక్షల కాల్స్ వచ్చినట్లు స‌మాచారం. ఈ గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా మహిళల, చిన్నపిల్లలపై వేధింపులు, హింస పెరిగినట్లు క్లియ‌ర్ గా తెలుస్తోంది.

ఇందులో 30 శాతం కాల్స్ (92,105).. చిన్నారులకు వేధింపలు, హింస నుంచి రక్షణ కోరుతూ వచ్చిన విజ్ఞప్తులేనని చైల్డ్​లైన్ డిప్యూటీ డైరెక్టర్ హర్లీన్ వాలియా తెలిపారు. 11 రోజుల్లో వచ్చిన కాల్స్​లో 11 శాతం హెల్త్ , 8 శాతం ఛైల్డ్ లేబ‌ర్, 8 శాతం మిస్సింగ్, పారిపోవటం, 5 శాతం నిరాశ్రయుల గురించి వచ్చినట్లు తెలిపారు. కరోనా వైర‌స్ కు సంబంధించి..మరో 1,677 మంది ప్రశ్నలు అడగగా.. 237 మంది హెల్త్ ఇష్యూస్ వ‌ల్ల ఫోన్ చేశారని వాలియా వెల్లడించారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ సమయంలో ఈ హెల్ప్​లైన్​ను ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్ గా గుర్తించాలని ఆమె కోరారు.

ఇక‌ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి అనేక కంప్లైంట్స్ అందినట్లు జాతీయ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ రేఖా శర్మ తెలిపారు. లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ఫిర్యాదుల‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ మెయిల్స్ ద్వారానే 69 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 1 వరకు మహిళలపై నేరాలకు సంబంధించి 257 కంప్లైంట్స్ అందినట్లు రేఖా శర్మ చెప్పారు. వీటిలో 69 కేసులు డొమెస్టిక్ వ‌యోలెన్స్ కు సంబంధించినవేనని తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu