COVID 19 Solution Challenge : కరోనాపై పోరాటంలో మీరూ భాగం అవ్వండి..
కోవిడ్ 19 – కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో… మహమ్మారికి వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రజల సంపూర్ణ మద్దతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నామని ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మరోవైపు కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికతను వినియోగించి వినూత్న పరిష్కారాలు కనుగొంటున్నట్లు ప్రభుత్వం […]

కోవిడ్ 19 – కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో… మహమ్మారికి వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రజల సంపూర్ణ మద్దతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నామని ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
మరోవైపు కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికతను వినియోగించి వినూత్న పరిష్కారాలు కనుగొంటున్నట్లు ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కుంది. బయో ఇన్ఫర్మేటిక్స్, డేటాసెట్‌లు, రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే యాప్స్ విషయంలో వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. వైరస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో సమాజంలో విభిన్న వర్గాలు కూడా పాల్గొనాలని..వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను ఎదుర్కునేందుకు ప్రజలు కూడా పరిష్కారాలను పంచుకోవాలని కోరింది. ప్రజలు సూచించిన పరిష్కారాలలో ఉపయోగకరమైని స్వీకరించడమే కాకుండా అందుకు రివార్డును(రూ. 1 లక్ష) కూడా అందిస్తామని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కోవిడ్ 19 సొల్యూషన్ ఛాలెంజ్‌ను పీఎం నరేంద్రమోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Harnessing innovation for a healthier planet.
A lot of people have been sharing technology-driven solutions for COVID-19.
I would urge them to share them on @mygovindia. These efforts can help many. #IndiaFightsCorona https://t.co/qw79Kjtkv2
— Narendra Modi (@narendramodi) March 16, 2020




