బ్రేకింగ్: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం!..తక్షణమే అమల్లోకి

|

Sep 29, 2019 | 5:20 PM

అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  తక్షణమే నిషేధం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కొరత కారణంగా యూపీఏ ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది..ఆ తర్వాత ధరలు తగ్గముఖం పట్టడంతో సడలించింది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.70 నుంచి రూ. 80 వరకు చేరిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక […]

బ్రేకింగ్: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం!..తక్షణమే అమల్లోకి
Follow us on

అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  తక్షణమే నిషేధం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కొరత కారణంగా యూపీఏ ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది..ఆ తర్వాత ధరలు తగ్గముఖం పట్టడంతో సడలించింది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.70 నుంచి రూ. 80 వరకు చేరిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఉల్లి ఉత్పత్తి దారుణంగా పడిపోయింది.