నూతన నేవీ చీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్

నూతన నేవీ చీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్

న్యూఢిల్లీ: కొత్త నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌ నియ‌మితుల‌య్యారు. ఈ విష‌యాన్ని ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ఈ ఏడాది మే 31న అడ్మిర‌ల్ సునిల్ లంబా రిటైర్ కానున్నారు. అయితే అడ్మిర‌ల్ సునిల్ స్థానంలో కరంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ప్ర‌స్తుతం అడ్మిర‌ల్ సింగ్‌.. వైజాగ్‌లోని ఈస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌కు ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా చేస్తున్నారు. కంద‌క్‌వ‌స్లాలోని నేష‌న‌ల్ డిఫెన్ష్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందిన‌ట్లు నేవీ వెబ్‌సైట్ పేర్కొన్న‌ది. 1980 జూలైలో క‌రంబీర్‌… ఇండియ‌న్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 4:02 PM

న్యూఢిల్లీ: కొత్త నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌ నియ‌మితుల‌య్యారు. ఈ విష‌యాన్ని ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ఈ ఏడాది మే 31న అడ్మిర‌ల్ సునిల్ లంబా రిటైర్ కానున్నారు. అయితే అడ్మిర‌ల్ సునిల్ స్థానంలో కరంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ప్ర‌స్తుతం అడ్మిర‌ల్ సింగ్‌.. వైజాగ్‌లోని ఈస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌కు ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా చేస్తున్నారు. కంద‌క్‌వ‌స్లాలోని నేష‌న‌ల్ డిఫెన్ష్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందిన‌ట్లు నేవీ వెబ్‌సైట్ పేర్కొన్న‌ది. 1980 జూలైలో క‌రంబీర్‌… ఇండియ‌న్ నేవీలో చేరారు. 1982లో హెలికాప్ట‌ర్ పైల‌ట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వెల్లింగ్ట‌న్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. 36 ఏళ్ల స‌ర్వీసులో.. అడ్మిర‌ల్ క‌రంబీర్‌.. ఇండియ‌న్ కోస్టు గార్డు షిప్‌, నావెల్ మిస్సైల్ కోర్వ‌ర్టి, గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్స్‌కు క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu