ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: పోచారం

ప్రజా శ్రేయస్సు కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోచారం.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే సర్కార్‌ సంకల్పం అన్నారు. మానవ జన్మకు తోడు, నీడ తప్పనిసరి అన్న ఆయన.. రూ. 2 కోట్ల 80 లక్షలతో 40 డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన చిరకాల స్వప్పమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకూడదనే సంకల్పంతో […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:40 pm, Sat, 17 August 19
ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: పోచారం
ప్రజా శ్రేయస్సు కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోచారం.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే సర్కార్‌ సంకల్పం అన్నారు. మానవ జన్మకు తోడు, నీడ తప్పనిసరి అన్న ఆయన.. రూ. 2 కోట్ల 80 లక్షలతో 40 డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన చిరకాల స్వప్పమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డా నెత్తిన బిందె ఎత్తుకుని నడవకూడదనే సంకల్పంతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తామని పోచారాం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.