వారెవ్వా ‘పెట్ డాగ్’..చిరుతతో పోరాడి..యజమానిని కాపాడి
కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు..శునకాలు మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాయి. వాటి విశ్వాసం ఎంత గొప్పదో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే బంగాల్లో జరిగింది. యజమాని ప్రాణాల కోసం ఏకంగా చిరుతతోనే పోరుకు సిద్ధపడి విజయం సాధించింది ఓ బ్రేవ్ డాగ్. వివరాల్లోకి వెళ్తే.. డార్జిలింగ్‌లో నివశించే అరుణ… నాలుగేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. దానికి నిక్ నేమ్ ‘టైగర్’ అని పెట్టుకుంది. ఈ నెల 14న రాత్రి వేళ ఇంటి కింద […]
కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు..శునకాలు మనుషుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాయి. వాటి విశ్వాసం ఎంత గొప్పదో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తాజాగా అలాంటి ఘటనే బంగాల్లో జరిగింది. యజమాని ప్రాణాల కోసం ఏకంగా చిరుతతోనే పోరుకు సిద్ధపడి విజయం సాధించింది ఓ బ్రేవ్ డాగ్.
వివరాల్లోకి వెళ్తే.. డార్జిలింగ్‌లో నివశించే అరుణ… నాలుగేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. దానికి నిక్ నేమ్ ‘టైగర్’ అని పెట్టుకుంది. ఈ నెల 14న రాత్రి వేళ ఇంటి కింద అంతస్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఒక చిరుత అరుణపై దాడి చేసింది. అది గుర్తించిన టైగర్.. వెంటనే ఆ అడవి మృగంతో సమరానికి దిగింది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న టైగర్ ధైర్యాన్ని చూసి చిరుత పారిపోయింది. అరుణ గాయాలతో బయటపడింది. దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. అరుణ ఇంటి పరిసరాల్లో ‘కెమెరా ట్రాప్’లు అమర్చారు.
WB:A pet dog saved life of its owner,Aruna Lama who was attacked by a leopard on Aug 14 in Darjeeling.Aruna’s daughter says,”as my mother was making her way to ground floor of our house she noticed a pair of glowing eyes,then the leopard attacked her but Tiger(pet dog) saved her” pic.twitter.com/JedUyCjGPd
— ANI (@ANI) August 17, 2019