Breaking శ్రీవారి దర్శనాలకు సర్కార్ ఓకే

తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి భక్తులకు దర్శనాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీకి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. కాకపోతే కండీషన్స్ అప్లికేబుల్ అని తేల్చి చెప్పింది.

Breaking శ్రీవారి దర్శనాలకు సర్కార్ ఓకే
Follow us

|

Updated on: Jun 02, 2020 | 4:09 PM

తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి భక్తులకు దర్శనాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీకి జగన్ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. అయితే కండీషన్స్ అప్లై అని తేల్చి చెప్పింది. ఈ మేరకు జూన్ 2వ తేదీన ప్రత్యేకంగా జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దాంతో రెండు నెలల పది రోజుల తర్వాత శ్రీవారి దర్శనాలకు రంగం సిద్దమవుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల మేరకు మాత్రమే దర్శనాలను ఏర్పాటు చేయబోతున్నారు. గంటకు కేవలం 500 మందికి మాత్రమే శ్రీవారి దర్శనం లభించనున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ కారణంగా మార్చి నెలలో నిలిచిపోయిన తిరుమలేశుని దర్శనాలను జూన్ 8వ తేదీన తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల్లో భక్తులకు దర్శనాలకు కల్పించేందుకు ఓకే చెప్పిన నేపథ్యంలో గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లను ప్రారంభించారు.

ఆనంద నిలయంలో భక్తుల దర్శనాలకు తీసుకున్న జాగ్రత్తలను వివరిస్తూ టీటీడీ బోర్డు ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. భక్తుల దర్శనాలకు అనుమతివ్వాలని కోరింది. దాంతో దేవాదాయ శాఖ నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వినిపించింది. అయితే ముందుగా టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

జూన్ 8వ తేదీ నుంచి టిటిడి ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మూడు, నాలుగు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఆ తరువాతే భక్తులకు అనుమతిస్తామని, రెడ్ జోన్ ప్రాంతాల నుంచి భక్తులు ఎవరూ రాకుండా ఉండటమే మంచిదని ఆయన తెలిపారు. ఆరు అడుగుల భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా వుండాలని చెప్పారు. ‘‘ క్యూ లైన్స్ మార్కింగ్ చేసాము.. భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని రావాలి ..అలిపిరి గేట్ వద్ద కూడా బుకింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం.. అన్న ప్రసాదం, హుండీల వద్ద రద్దీ ఉంటుంది.. హుండీల వద్ద భక్తులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాము.. భక్తులను అలిపిరి వద్దే స్క్రీనింగ్ నిర్వహిస్తాం.. కరోనాకు ముందున్న పరిస్థితులు ఇపుడు ఉండవు.. ఆ స్థాయిలో భక్తులు దర్శనానికి వచ్చే పరిస్థితి ఉండదు ’’ అని ఛైర్మెన్ తెలిపారు.