స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్: ఇక నుంచి తెలుగులోనూ ఈ పరీక్ష..!
తెలుగు రాష్ట్రాల ఇంటర్ స్టూడెంట్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి తెలుగు భాషలో కూడా.. జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భాషను మొత్తంగా 11 భాషల్లో నిర్వహించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ (మానవ వనరుల అభివృద్ధి శాఖ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, ఉర్ధూలతో పాటుగా ఇక తెలుగులోనూ.. ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే.. దీన్ని 2021వ సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. […]
తెలుగు రాష్ట్రాల ఇంటర్ స్టూడెంట్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి తెలుగు భాషలో కూడా.. జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భాషను మొత్తంగా 11 భాషల్లో నిర్వహించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ (మానవ వనరుల అభివృద్ధి శాఖ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, ఉర్ధూలతో పాటుగా ఇక తెలుగులోనూ.. ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే.. దీన్ని 2021వ సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీల్లో.. సీటు పొందేందుకు.. జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయడం తప్పనిసరి. ఇందులో మార్కుల ఆధారంగానే.. ఐఐటీలో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పరీక్షను.. హిందీ, ఇంగ్లీషు, గుజరాతీ భాషల్లోనూ.. రాస్తున్నారు. ఇక నుంచి.. ఇతర భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించాలని.. ఇటీవలే.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన కేంద్రం.. 11 భాషల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే.. 2020వ సంవత్సరానికి షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంలో… ఈ మార్పులు 2021 నుంచి ప్రాంతీయ భాషల్లో రానుంది.