Gold Price Today: పండగ వేళ గుడ్‌న్యూస్.. రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు!
Gold Price Today: భారతీయ పెట్టుబడిదారుల బంగారం కొనుగోలు విధానాలు కూడా మారుతున్నాయి. ప్రజలు ఇప్పుడు కేవలం ఆభరణాలు కొనడానికి బదులుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు రికార్డు..

Gold Price Today: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరువవుతున్న ముడి చమురు ధరలు, రూపాయి కదలికల కారణంగా రాబోయే వారంలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అయితే పండుగ సీజన్‌కు కొద్ది రోజుల ముందు బంగారం, వెండిల ఆకర్షణ మసకబారింది. ఈ నవరాత్రుల సమయంలో బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారుల బంగారం కొనుగోలు విధానాలు కూడా మారుతున్నాయి. ప్రజలు ఇప్పుడు కేవలం ఆభరణాలు కొనడానికి బదులుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. గత పది రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 3,770 రూపాయల వరకు దిగి వచ్చింది. ఈ పండుగ సీజన్‌లో మీరు బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తుంటే అక్టోబర్ 19న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
- హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,800 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,490 వద్ద ట్రేడవుతోంది.
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,340 వద్ద ట్రేడవుతోంది.
- ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా రికార్డు స్థాయిలో పడిపోతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,29,000 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
