మండుతోన్న బంగారం! ఇప్పటికే 10వేలు పెరిగింది.. నెక్ట్స్ అరలక్షేనా?

ప్రస్తుతం పసిడి ధరలు భగభగా మండుతున్నాయి. శీతాకాలంలో సైతం వాటి ధరలు వింటుంటే.. చమటలు పడుతోన్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు అరలక్ష వైపుగా పరుగులు పెడుతోంది. ఇరాక్‌-అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా.. రూపాయి విలువ మరింత దిగజారింది. దీంతో.. బంగారం ధరలు పైపైకి పెరగనున్నాయని సమాచారం. అలాగే అటు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2019 సంవత్సరంలో కూడా బంగారంపై పెట్టుబడుల కారణంగా 21 శాతం లాభం […]

మండుతోన్న బంగారం! ఇప్పటికే 10వేలు పెరిగింది.. నెక్ట్స్ అరలక్షేనా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 06, 2020 | 4:12 PM

ప్రస్తుతం పసిడి ధరలు భగభగా మండుతున్నాయి. శీతాకాలంలో సైతం వాటి ధరలు వింటుంటే.. చమటలు పడుతోన్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు అరలక్ష వైపుగా పరుగులు పెడుతోంది. ఇరాక్‌-అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా.. రూపాయి విలువ మరింత దిగజారింది. దీంతో.. బంగారం ధరలు పైపైకి పెరగనున్నాయని సమాచారం. అలాగే అటు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2019 సంవత్సరంలో కూడా బంగారంపై పెట్టుబడుల కారణంగా 21 శాతం లాభం చేకూరింది. దీంతో ఈ సంవత్సరం కూడా పసిడి ధరలు పెరిగే అవకాశం నెలకొంది.

కాగా.. 2019 ఏడాది ప్రారంభంలో.. 24కే 10 గ్రాముల బంగారం 30 వేలుగా ఉండేది. కానీ.. సంవత్సరారంభం వచ్చేసరికి అది 40 వేలకు అంటే ఏకంగా 10 వేలు పెరిగింది. దీంతో.. 2020వ సంవత్సరంలో కూడా మరో 10 వేలు పెరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 42,500లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల ధర రూ.38,960గా ఉంది. అటు వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌ మార్కెట్ ప్రకారం కిలో వెండి రూ.51,000లుగా ఉంది.