బంగారం ఎంత తగ్గిందంటే..

తాజాగా దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు మరోసారి స్వ‌ల్పంగా త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధ‌ర రూ.75 త‌గ్గి రూ.51,069కి చేరింది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర...

బంగారం ఎంత తగ్గిందంటే..
Follow us

|

Updated on: Oct 23, 2020 | 6:54 PM

Gold And Silver Prices : దేశీయ మార్కెట్ పసిడి ధరలు గత కొద్దిరోజులుగా దోబుచులాడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో గరిష్టస్థాయిని తాకిన బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇక ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతూ, తగ్గతూ ఊగిసలాడుతోంది.

తాజాగా దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు మరోసారి స్వ‌ల్పంగా త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధ‌ర రూ.75 త‌గ్గి రూ.51,069కి చేరింది. గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర 51,144 వ‌ద్ద ముగిసింది. అయితే వెండి ధ‌ర‌లు మాత్రం శుక్ర‌వారం నాటి ట్రేడ్‌లో స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.121 పెరిగి రూ.62,933కు చేరింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.62,812 వ‌ద్ద ముగిసింది. ఇక, అంత‌ర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే.. బ‌ల‌హీన ట్రెండ్ కార‌ణంగా ప‌సిడి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

దసరా సమయంలో బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గినా అదే పదివేలు అనుకొంటున్నారు సామాన్యజనం. దీంతో పసిడిని కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద పండుగగా జరుపుకునే శరన్నవరాత్రుల్లో పసిడిని కొనేందుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు.