ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. ధవళేశ్వరానికి రెండవ ప్రమాద హెచ్చరిక..

గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఈ ఏట పలుసార్లు భారీ వరదలు వచ్చాయి. అయితే తాజాగా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 49.8 అడుగులకు చేరన ప్రవాహం.. రాత్రికి 50.80 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, […]

ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. ధవళేశ్వరానికి రెండవ ప్రమాద హెచ్చరిక..
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 8:19 AM

గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఈ ఏట పలుసార్లు భారీ వరదలు వచ్చాయి. అయితే తాజాగా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 49.8 అడుగులకు చేరన ప్రవాహం.. రాత్రికి 50.80 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. కుంట వద్ద శబరి నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాదకర హెచ్చరికలు జారీ చేశారు. 11లక్షల 8వేల 535 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12.60 అడుగులకు చేరింది. ఈసారి 16 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక భద్రాచలం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు పొంచి ఉండటంతో.. తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ఏజెన్సీ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు వరద బారిన పడ్డాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరికి వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.