ప్ర‌మాద‌క‌రంగా గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి : విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చ‌రిక‌లు‌

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావరికి వరద ఉధృతి ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతుంది. ఇప్ప‌టికే గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

ప్ర‌మాద‌క‌రంగా గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి : విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చ‌రిక‌లు‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2020 | 12:10 PM

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావరికి వరద ఉధృతి ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతుంది. ఇప్ప‌టికే గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ‌ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 9,26,446 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేప‌థ్యంలో వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు. బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చ‌రించారు.

Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త