AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కురచ దుస్తులు వేసుకునే అమ్మాయిల్ని చంపేయాలి…

ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట లింగ వివక్ష అనేది ఉంటోంది. స్త్రీలు సంప్రదాయాలు, ఆచారాలు వంటి అడ్డుగోడలను బద్దలుగొట్టి స్వేచ్ఛ, సమానత్వం వైపు అడుగులు వేయాలని అందరూ ఆశిస్తారు. అయితే ఈ సమాజం మాత్రం పురుషులే గొప్పా.. మహిళలు వాళ్ళ కంటే ఒక్క మెట్టు కిందనే ఉంటారని చెబుతూ వస్తుంది. కొన్ని చోట్ల ఇలాంటి వ్యవహారధోరణులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న […]

కురచ దుస్తులు వేసుకునే అమ్మాయిల్ని చంపేయాలి...
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 17, 2019 | 10:25 AM

Share

ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట లింగ వివక్ష అనేది ఉంటోంది. స్త్రీలు సంప్రదాయాలు, ఆచారాలు వంటి అడ్డుగోడలను బద్దలుగొట్టి స్వేచ్ఛ, సమానత్వం వైపు అడుగులు వేయాలని అందరూ ఆశిస్తారు. అయితే ఈ సమాజం మాత్రం పురుషులే గొప్పా.. మహిళలు వాళ్ళ కంటే ఒక్క మెట్టు కిందనే ఉంటారని చెబుతూ వస్తుంది. కొన్ని చోట్ల ఇలాంటి వ్యవహారధోరణులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనలు వెల్లువెత్తుతుంటే.. కొంతమంది పోలీసులు మాత్రం ఆడవారి పట్ల తమశైలిని మార్చట్లేదు. ‘కురచ దుస్తులు ధరించే అమ్మాయిలను వాళ్ళ తల్లిదండ్రులే చంపేయాలి.. లేదా వేరెవరైనా చంపేస్తారు’. ఈ సంచలన వ్యాఖ్యలు స్వయంగా గురుగ్రామ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ చేశాడు. ఓ జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది.

‘ఈ రేప్‌లు, సామూహిక అత్యాచారాలకు పురుషులే కారణం కాదు. ఏ పురుషుడూ రాక్షసుడు కాదు. కొంతమంది యువతులకు వారి తల్లిదండ్రులు సరైన విద్యను అందించరు. ఎలా డ్రెస్ చేసుకోవాలన్నది నేర్పించరు. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి ఇలా అన్నీ నేర్చుకునే స్థితిలో వారు ఉండరు. చేజేతులారా వారే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అంతేకాకుండా కురచ దుస్తులతో అర్ధరాత్రి వరకు పబ్‌ల్లో, రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుంటారు. ఆ సమయంలో జరగకూడని ఘోరం జరిగితే పోలీసులు ఏం చేయగలరు.? చలి వేస్తోందంటే.. మేమైనా ఒంటి నిండా దుస్తులు ధరిస్తాం.. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం కురచ దుస్తుల్లోనే ఉంటారు’ అని ఆ పోలీస్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తాను హుడా సిటీ సెంటర్‌లో ఉన్నప్పుడు.. అక్కడ ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్ చూసి అవాక్కయానని అతను తెలిపాడు. ఒళ్ళు కనిపించేలా కురచ దుస్తులు, ఛాతీపై రెండు టాటూలు ఉన్నాయి. అసలు ఆ వస్త్రధారణ ఏంటి.? ఇలాంటి వాళ్ళను కన్నవాళ్ళే చంపేయాలి.. లేదా వారు చచ్చిపోవాలని అన్నాడు. ప్రస్తుతం ఈ పోలీస్ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్