GHMC Elections: మందకొడిగా పోలింగ్… గ్రేటర్‌లో మధ్యాహ్నం 3గంటల వరకు 29.76 శాతం నమోదు

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు జనం మొగ్గుచూపకపోవడంతో పోలింగ్ శాతం బాగా తగ్గింది.

  • Updated On - 6:02 pm, Tue, 1 December 20 Edited By: Ram Naramaneni
GHMC Elections: మందకొడిగా పోలింగ్... గ్రేటర్‌లో మధ్యాహ్నం 3గంటల వరకు 29.76 శాతం నమోదు


గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు జనం మొగ్గుచూపకపోవడంతో పోలింగ్ శాతం బాగా తగ్గింది. ఇప్పటివరకు 14 డివిజన్లలో 1శాతం పోలింగ్‌ కూడా నమోదు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గానూ మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా 29.76 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం గ్రేటర్ పరిధిలో 74,12,601 ఓట్లకు గానూ మధ్యాహ్నం 3గంటల వరకు 22,06,173 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  మరోవైపు, కనీసం ఎన్నికల అధికారు పోలింగ్ చిటీలు పంచకపోవడంతో పోలింగ్ కేంద్రాలు తెలయక జనం తికమకపడ్డారు. అయితే, కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఓటర్లు.. ఎన్నికల కేంద్రాల వద్దకు రావడానికి సంశయిస్తున్నట్లుగా కన్పిస్తోందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక వైపు చలి కూడ తోడవ్వటంతో భారీగా పోలింగ్ శాతం తగ్గిందంటున్నారు అధికారులు. కాగా, సాయంత్రం కల్లా ఓటింగ్ శాతం పెరగవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డివిజన్లు, సర్కిళ్లలో పోలింగ్‌ వివరాలుః

బేగంబజార్ – 28.6 శాతం, గోషామహల్‌లో – 16 శాతం, మంగల్ హాట్‌లో 19.8 శాతం, దత్తాత్రేయ నగర్‌లో 41.4 శాతం, జాంబాగ్‌లో 34.4 శాతం, గన్‌ఫౌండ్రీలో 35.3 శాతం, కుత్బుల్లాపూర్‌లో 28.4 శాతం, గాజులరామారంలో 36.6 శాతం, సనత్‌నగర్‌లో 26.29 శాతం, అమీర్‌పేటలో 26.31 శాతం, హయత్‌నగర్ డివిజన్‌లో 34.79 శాతం, చాంద్రయాణగుట్టలో 15.9 శాతం, చందానగర్ డివిజన్‌లో 22.55 శాతం, మాదాపూర్‌లో 22.70 శాతం, మియాపూర్‌లో 25.47 శాతం, హఫీజ్‌పేట్‌ డివిజన్‌లో 20.98 శాతం, చందానగర్‌లో 21.42, కాచిగూడలో 38.94 శాతం, నల్లకుంటలో 38.03 శాతం, గోల్నాకలో 36.34 శాతం, అంబర్‌పేటలో 38.59 శాతం, బాగ్ అంబర్‌పేటలో 64.78 శాతం, బోరబండలో 35.69 శాతం, అల్లాపూర్‌లో 33.43 శాతం, వెంగల్‌రావు నగర్‌లో 28.32 శాతం, రహ్మత్ నగర్‌లో 31.11 శాతం, ఎర్రగడ్డలో 30.55 శాతం, ఫతేనగర్‌లో 34.77 శాతం, సనత్ నగర్‌లో 26.19 శాతం, మూసాపేట్‌ డివిజన్ పరిధిలోని డివిజన్లలో 34.25 శాతం, కూకట్‌పల్లి డివిజన్ పరిధిలో 26.03 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్న నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.