AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రభుత్వం బంపరాఫర్..సీఎం జగన్ మార్క్ నిర్ణయం!

ఇంతకుముందు పరిపాలించిన అనుభవం లేదు..కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగల్గుతున్నారు?.. ఇది సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు, అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సీఎం జగన్ మార్క్ ప్రస్పుటంగా కనిపిస్తుంది. దేశంలో ఏ సీఎం చేయని, సాహసించని రివర్స్ టెండరింగ్, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టం చేయడం జగన్‌కే చెల్లుతుంది. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే విధంగా జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. […]

ఏపీ ప్రభుత్వం బంపరాఫర్..సీఎం జగన్ మార్క్ నిర్ణయం!
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2019 | 8:51 AM

Share

ఇంతకుముందు పరిపాలించిన అనుభవం లేదు..కానీ సీఎంగా ఇంత పరిణితి ఎలా ప్రదర్శించగల్గుతున్నారు?.. ఇది సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇప్పుడు ఏపీలోని సీనియర్ మంత్రులు, అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. ఏపీలో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సీఎం జగన్ మార్క్ ప్రస్పుటంగా కనిపిస్తుంది. దేశంలో ఏ సీఎం చేయని, సాహసించని రివర్స్ టెండరింగ్, పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టం చేయడం జగన్‌కే చెల్లుతుంది. ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకునే విధంగా జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల విమర్శలను లైట్ తీసుకుంటూ… కాలయాపన చేయకుండా సంక్షేమంపై దృష్టి పెడుతున్నారు.

గ్రామ వలంటీరు వ్యవస్థను స్వీకారం చుట్టిన జగన్..అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. “కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు..పార్టీ అసలే చూడొద్దు..మనకు ఓటు వేయనివారు కూడా మంచి పాలన చూసి..వచ్చే ఎన్నికల్లో మనసు మార్చుకోవాలి” ఇవి ఇటీవలే నియామక పత్రాలు అందుకున్న వలంటీర్లను ఉద్దేశించి జగన్ చెప్పిన మాటలు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే సీఎం తానేంటో..ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అటు ఎక్కువగా దాడుల రాజకీయం చేస్తుంది తప్ప..జగన్ పాలనలోని లోపాలపై సమర్థవంతంగా వేలెత్తి చూపలేకపోతుంది.

ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన జగన్.. నిరుద్యోగులకు మరో శుభవార్తను తీసుకొస్తున్నారు. జాబ్స్ లేవని ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ప్రతి ఒక్కరు వారి లక్ష్యంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇకపై ప్రతి జనవరిలో వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు. మరో మూడు నెలల్లో జనవరి రాబోతున్నది కాబట్టి అప్పటికి మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక జరగబోతుందని సీఎం హింట్ ఇచ్చారు. జనవరి నెలను ఉద్యోగాల కల్పన నెలగా మారుస్తామని ఇప్పటికే పేర్కొనడం విశేషం. కాగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే దాదాపుగా లక్షా 26వేల మందికి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్టు జగన్ చెప్పిన విషయం తెలిసిందే.