ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు..!

డ్రైవింగ్ లైసెన్స్.. వాహనాలను నడిపే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఇచ్చే అనుమతి పత్రం. అయితే ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోందడం కాస్త సులువుగానే ఉండేది. దానికి కారణం.. ఇంటి దగ్గర, డ్రైవింగ్ స్కూల్స్‌లో కాస్త ట్రైన్ అయ్యి.. టెస్ట్‌లో పాల్గొని ఉత్తీర్ణులు అయ్యేవారు. అయితే ఈ సమయంలో కొందరు అటు ఇటూ వణికినా.. మరో అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుని ఎదోలా పాస్ అయ్యి.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారు. అయితే ఇప్పుడు […]

ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు..!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 1:01 PM

డ్రైవింగ్ లైసెన్స్.. వాహనాలను నడిపే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఇచ్చే అనుమతి పత్రం. అయితే ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోందడం కాస్త సులువుగానే ఉండేది. దానికి కారణం.. ఇంటి దగ్గర, డ్రైవింగ్ స్కూల్స్‌లో కాస్త ట్రైన్ అయ్యి.. టెస్ట్‌లో పాల్గొని ఉత్తీర్ణులు అయ్యేవారు. అయితే ఈ సమయంలో కొందరు అటు ఇటూ వణికినా.. మరో అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుని ఎదోలా పాస్ అయ్యి.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.

ఇటీవల కేంద్రం రోడ్డు రవాణా ప్రమాదాలపై సీరియస్‌గా చర్యలు చేపట్టింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా మోటార్ వెహికిల్ చట్టానికి పదును పెట్టింది. అంతేకాదు.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలను విధించేలా చట్టాన్ని సవరించింది. అయితే ఇప్పుడు వాహనదారులకు ఇచ్చే లైసెన్స్‌లపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపక్రమించింది. డ్రైవింగ్ అర్హత లేకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకువచ్చే సరికి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో గాయపడే వారు కొందరైతే, ప్రాణాలు కోల్పోతున్న వారు మరికొందరు. అయితే ఇదంతా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనుకోవాలా, లేక వాహనాలను నడిపే సామర్థ్యం లేకపోవటయా అన్న దానిపై కేంద్ర ఆలోచనలు మొదలు పెట్టంది. ఇక వాహనలు నడిపే వారి భద్రత దృష్ట్యా ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, పోలీసు, రవాణా శాఖలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినం చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అప్లే చేసుకున్న సదరు వ్యక్తి కచ్చితంగా వాహనాన్ని నడిపే సామర్థ్యం ఉన్నట్టు రుజువైతేనే లైసెన్స్ జారీ చేస్తామని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం వస్తున్న చాలామంది డ్రైవింగ్ చేయడంలో తడబడుతున్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్నప్పడు కాస్త వణకడం ధృడ విశ్వాసం లేకుండానే డ్రైవ్ చేయడంతో.. ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురై.. ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో లైసెన్సుల జారీ ఎలా జరిగినా.. ఇకపై పకడ్బందీగా జారీ చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇక ఇప్పటినుండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడమంటే అంత సులువేం కాదు. వాహనం నడపడంలో కాస్త తడబడి అటు ఇటైతే టెస్ట్‌ ఫెయిలయ్యే చాన్స్‌ ఉంది. ఇక వాహనదారుడి ప్రతి కదలికను పసిగట్టే హైటెక్నాలజీ వున్న సెన్సర్లతో లైసెన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ విధానం అన్ని ఆర్టీవో ఆఫీసుల్లోకి రాబోతోంది.

ఈ సెన్సర్‌ కలిగిన సీసీ కెమెరాలు, డ్రైవింగ్‌ ట్రాక్‌పై 25 నుంచి 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. అప్పుడు డ్రైవర్‌ ట్రాక్‌పైకి వచ్చినప్పటి నుంచి బయటకెళ్లే వరకు అన్ని కదలికలను ఈ కెమెరాలు నిక్షిప్తంచేస్తాయి.టెస్ట్ టైంలో డ్రైవర్ వెహికిల్ ఎలా డ్రైవ్ చేశాడు.. ఎన్ని సార్లు బండి ఆగింది.. డ్రైవింగ్‌లో ఏమైనా లోపాలున్నాయా? అన్న అంశాలను ఈ సీసీ కెమెరాలతో గుర్తిస్తారు. అంతేకాదు.. మార్కులను కూడా బండి నడిపే విధానం ఆధారంగా వేస్తారు. అది కూడా ఈ సీసీ కెమెరా ఆధారంగానే.. సో ఇక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. కష్టపడాల్సిందే.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే