జడ్జీల సంఖ్యను పెంచండి…కేంద్రానికి కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయ మూర్తుల సంఖ్యను పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని ఆయన కోరారు. విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ హైకోర్టుకు […]

  • Sanjay Kasula
  • Publish Date - 10:56 pm, Wed, 26 August 20
జడ్జీల సంఖ్యను పెంచండి...కేంద్రానికి కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయ మూర్తుల సంఖ్యను పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని ఆయన కోరారు.

విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ హైకోర్టుకు ప్రస్తుతం కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల స్థానంలో 42 మంది న్యామూర్తులను నియమించాలని కోరారు.
కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు.