‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన జగన్ సర్కార్.. 18వేల మందికి పైగా ప్రయోజనం, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
గత ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన వైఎస్ఆర్ చేయూత పథకానికి రెండో విడత నిధులను విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Funds released for YSR cheyutha: 2020-21 ఆర్ధిక సంవత్సరానికి వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం పరిపాలనానుమతి జారీ చేసింది. వైఎస్ఆర్ చేయూత రెండో విడత కింద 151 కోట్ల 47 లక్షల రూపాయల్ని మంజూరు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తాన్ని లబ్దిదారులకు అందించేలా చర్యలు చేపట్టాలంటూ ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వైఎప్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారు. 45 నుంచి 60 ఏళ్ల మహిళల అభ్యున్నతి కోసం గతంలో ఏ పథకం లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయూత ద్వారా వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద మొత్తం నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందుతుందని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుందని, మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించడమే ఉద్దేశమని గతంలో చెప్పిన మాటలను ముఖ్యమంత్రి నిజం చేస్తూ తాజాగా రెండో విడత నిధులకు చేయూతకు విడుదల చేశారు.
ALSO READ: ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన నిర్మల




