Ayodhya: అయోధ్యలో హోటళ్లకు ఫుల్ డిమాండ్.. అసలు కారణమిదే

ఇటీవలనే అయోధ్యలో అంగరంగ వైభవంగా రామమందిరం దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ఆలయం అందుబాటులోకి రావడంతో దేశ నలుములాల నుంచి భక్తుల అయ్యోధ రామయ్యను చూసేందుకు తరలివస్తున్నారు. అయితే అయోధ్యలో భక్తుల సంఖ్య ఎలా పెరుగుతూ వస్తోందో, అందుకనగుణంగా హోటళ్లు పుట్టుకొస్తున్నాయి.

Ayodhya: అయోధ్యలో హోటళ్లకు ఫుల్ డిమాండ్.. అసలు కారణమిదే
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Feb 20, 2024 | 10:32 AM

ఇటీవలనే అయోధ్యలో అంగరంగ వైభవంగా రామమందిరం దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ఆలయం అందుబాటులోకి రావడంతో దేశ నలుములాల నుంచి భక్తుల అయ్యోధ రామయ్యను చూసేందుకు తరలివస్తున్నారు. అయితే అయోధ్యలో భక్తుల సంఖ్య ఎలా పెరుగుతూ వస్తోందో, అందుకనగుణంగా హోటళ్లు పుట్టుకొస్తున్నాయి. పర్యాటకంగానూ డెవలప్ కావడంతో పలు పెద్ద పెద్ద సంస్థలు తమ హోటళ్లను అయోధ్యలో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి.

రామ మందిర కారణంగా 2031 నాటికి ఏటా 10.61 కోట్ల మంది పర్యాటకులు సందర్శించే అవకాశం ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే భక్తుల సౌకర్యం తగ్గట్టుగా వేల సంఖ్యలో హోటల్స్ అవసరమని ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అంచనా వేసింది. ఇది పవిత్ర నగరాన్ని హోటళ్లకు ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుస్తుందని, 2017కు ముందు ఉనికిలో లేని మార్కెట్లో భారీ వ్యాపార అవకాశాలను తెరుస్తుందని హోటల్వేట్ అభిప్రాయ పడుతుంది.

అయితే, బడ్జెట్ ఎకానమీ విభాగంలో కేవలం రెండు బ్రాండెడ్ హోటళ్లు మాత్రమే రామ మందిర ప్రతిష్ఠాపనకు ముందు తెరుచుకున్నాయి. పెద్ద సంస్థలు ఒప్పందాలు లేదా ఎంవోయూలపై సంతకాలు చేశాయి. అంటే వారి హోటళ్లు రావడానికి మరో మూడు నుండి ఐదు సంవత్సరాలు పడుతుంది. మిహిర్ చలీషాజర్, హోటల్స్ సీఈఓ మానవ్ తడానీ సంయుక్తంగా నివేదిక ప్రకారం.. అయోధ్యను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం వ్యూహాత్మక దృష్టి ఆధ్యాత్మిక, పర్యాటకంగా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి.

2022 లో ఆధ్యాత్మిక కేంద్రాలు అయిన వారణాసి, రిషికేష్, కత్రా, హరిద్వార్, తిరుపతి, ద్వారకాతో సహా సుమారు రూ .1.3 లక్షల కోట్లు (16 బిలియన్ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. మొత్తం 140 కోట్లు (1.4 బిలియన్ డాలర్లు) వచ్చాయని పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది సుమారుగా భారతదేశంలో సంవత్సరానికి తలసరి ఆదాయంలో కీలకంగా మారుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రద్దీ ప్రధాన గమ్యస్థానాలకు మాత్రమే పరిమితం కాలేదు. శబరిమల వంటి అంతగా ప్రసిద్ధి చెందని ప్రాంతాల్లో పర్యాటకం డెవలప్ అవుతోంది. 2017లో వార్షిక దీపోత్సవ్ వేడుకలతో ప్రారంభమైన అయోధ్య పర్యాటక రంగం 2019లో సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పు తర్వాత ఊపందుకుంది. 2023లో మూడు కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారని, 2031 నాటికి రోజుకు మూడు లక్షల మంది పర్యాటకులు వస్తారని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి