వీసా ఫ్రాడ్..అమెరికాలో నలుగురు భారతీయుల అరెస్ట్

తమ సంస్థల ప్రయోజనాలకోసం హెచ్-1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై అమెరికాలో రెండు ఐటీ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ విజయ్ మన్నం, 47 సంవత్సరాల వెంకటరమణ మన్నం, కాలిఫోర్నియా వాసి సతీష్ వేమూరి, ఫెర్డినాండో శిల్వాలపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశారు. విజయ్, వెంకటరమణ , సతీష్ కలిసి న్యూజెర్సీ లో ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ పేరుతో […]

వీసా ఫ్రాడ్..అమెరికాలో నలుగురు భారతీయుల అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 1:02 PM

తమ సంస్థల ప్రయోజనాలకోసం హెచ్-1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై అమెరికాలో రెండు ఐటీ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ విజయ్ మన్నం, 47 సంవత్సరాల వెంకటరమణ మన్నం, కాలిఫోర్నియా వాసి సతీష్ వేమూరి, ఫెర్డినాండో శిల్వాలపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశారు. విజయ్, వెంకటరమణ , సతీష్ కలిసి న్యూజెర్సీ లో ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఉద్యోగులను అందించే సంస్థలను నడిపేవారు. శిల్వా కూడా అదేచోట కలేయింట్-ఎ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. యుఎస్ లో ఉద్యోగం కోసం ఉపయోగపడే హెచ్-1 బీ వీసాలను విదేశీ నిపుణులకు ప్రొక్యూర్ ప్రొఫెషనల్ , క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ అందిస్తున్నాయి. ఇవి న్యూజెర్సీ లోని మిడిల్ సెక్స్ కౌంటీలో ఉన్నాయి. వీసా దరఖాస్తులను వేగవంతంగా పొందడానికి అప్లికెంట్లు ఇదివరకే క్లైయింట్-ఎ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని అమెరికా జస్టిస్ విభాగం తెలిపింది. తద్వారా తమ పోటీ సంస్థలకన్నా ముందుగానే ఎలాంటి వీసా అవరోధం లేకుండా ఉద్యోగులను అమెరికాకు రప్పించే ప్రయత్నాలు వీరు చేశారని ఆరోపించింది. గత నెల 25న వెంకటరమణ మన్నం, శిల్వా నెవార్క్ కోర్టులో హాజరు కాగా. ఈ నెల 1 న సతీష్ వేమూరి అదే కోర్టులో హాజరయ్యాడు, వీరికి రెండున్నర లక్షల అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ సొమ్ము చెల్లించిన వీరు విడుదలయ్యారు.