COVID19 తెలంగాణలో దడ పుట్టిస్తున్న 4 జిల్లాలు

రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే రెడ్ జోన్లు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి.

COVID19 తెలంగాణలో దడ పుట్టిస్తున్న 4 జిల్లాలు
Follow us

|

Updated on: Apr 18, 2020 | 2:20 PM

రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజధాని హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే రెడ్ జోన్లు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ‌జిల్లాతోపాటు మరో మూడు జిల్లాలు కరోనా ప్రభావంతో భయాందోళన చెందుతున్నాయి. తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో దాదాపు సగానికి పైగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 266 రెడ్ జోన్స్‌ని ప్రకటించగా… అందులో 146 కేవలం హైదరాబాద్ నగరంలో పరిధిలోనే వున్నాయి. దానికి తోడు నగరంలో జనసాంద్రత ఎక్కువ. దాంతో నగరంలో అసలు కరోనా నియంత్రణ సాధ్యమవుతుందా అన్న సందేహాలు సామాన్య ప్రజానీకంలో వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంతోపాటు నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధిక శాతం ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చినవారివే. వారికి సంబంధించిన వారు, కుటుంబీకులు, వారిని కలిసిన వారిలోకే ఎక్కువ కరోనా లక్షణాలు కనిపించాయి. వారిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నాలుగు జిల్లాల్లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కట్టడికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న అధికారులు.. అవి ఫలితమిస్తున్నట్లే కనిపిస్తూ మళ్ళీ హెచ్చు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో అవాక్కవుతున్నారు. కరీంనగర్, వరంగల్ అర్బన్ మరి కొన్ని జిల్లాలో వ్యాప్తిని పకడ్బందిగా అరికట్టిన అధికారులు.. హైదరాబాద్ నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం అరికట్టలేక చతికిలా పడుతున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో అమలు చేసిన విధానాన్ని ఈ నాలుగు చోట్ల అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం తాజాగా.

ఈ నాలుగు జిల్లాల్లో కాంటాక్టు ట్రేసింగ్ కష్టమవడం, తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు సహకరించకపోవడంతో కరోనా నియంత్రణ సాధ్యం కావడం లేదన్ కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ వంటి చోట్ల తబ్లిఘీ జమాత్ వర్కర్లను గుర్తించకుండా ఎంఐఎం నేతలు అడ్డుతగులుతున్నారని, అందుకు నిజామాబాద్ డిప్యూటీ మేయర్ పోలీసులను అడ్డుకున్న ఉదంతమే ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నెలల పాటు లాక్ డౌన్ అమలు పరిచినా హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కరోనా కట్టడి కాదని, పైగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..