AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజ‌వాడ రెడ్ జోన్ ప్రాంతంలో వివాహ వార్షిక వేడుక..కేసు బుక్ చేసిన పోలీసులు

ఇది క‌రోనావైర‌స్ అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న టైమ్. ఈ స‌మ‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇక ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన‌ రెడ్‌ జోన్స్ ప‌రిధిలో మరింత అప్ర‌మత్త‌త అవ‌స‌రం. అయితే విజ‌యవాడ‌లోని వ‌న్ టౌన్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఏరియాలో వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. దీనికి కొంద‌రు స్థానిక నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఈ విష‌యంపై పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో..దానికి హాజరైన స్థానిక నేతలతో పాటు నిర్వాహకులపైనా 1వ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. పోలీసులు […]

బెజ‌వాడ రెడ్ జోన్ ప్రాంతంలో వివాహ వార్షిక వేడుక..కేసు బుక్ చేసిన పోలీసులు
Ram Naramaneni
|

Updated on: Apr 18, 2020 | 1:59 PM

Share

ఇది క‌రోనావైర‌స్ అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న టైమ్. ఈ స‌మ‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇక ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన‌ రెడ్‌ జోన్స్ ప‌రిధిలో మరింత అప్ర‌మత్త‌త అవ‌స‌రం. అయితే విజ‌యవాడ‌లోని వ‌న్ టౌన్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఏరియాలో వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. దీనికి కొంద‌రు స్థానిక నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఈ విష‌యంపై పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో..దానికి హాజరైన స్థానిక నేతలతో పాటు నిర్వాహకులపైనా 1వ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం… బుధవారం అర్ధరాత్రి పాతబస్తీలోని 52వ డివిజన్‌లో కొందరు స్థానిక నాయకులు వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. అయితే ఆ ప్రాంతం రెడ్‌ జోన్ ప‌రిధిలో ఉండ‌టంతో గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ ప్రకారం ఎలాంటి వేడుకలు నిర్వ‌హించ‌కూడ‌దు. వారు నిబంధనలు అతిక్ర‌మించినందుకుగాను మొత్తం 8 మంది నాయకులపై కేసును నమోదు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రిలీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఎవరూ ఎలాంటి వేడుకలు నిర్వహింకూడ‌ద‌ని, ఆదేశాలు బేఖాత‌రు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?