డెలివరీ బాయ్ నిర్వాకం..పుడ్ ఇచ్చి..పెట్ డాగ్‌ని కిడ్నాప్ చేశాడు!

ప్రస్తుతం ఇంట్లో ఉంటే చాలు..ప్రతిది ఆన్‌లైన్ డెలివరీ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. దీని వల్ల చాలా టైం సేవ్ అవుతుందన్న విషయం పక్కనపెడితే కొన్ని వింత సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఓ కస్టమర్‌కు ఆహారాన్ని డెలవరీ చేసిన జొమాటో డెలవరీ బాయ్.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడు. పుణెకు చెందిన వందన షా సోమవారం జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. తుషార్ అనే యువకుడు దాన్ని డెలవరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత […]

డెలివరీ బాయ్ నిర్వాకం..పుడ్ ఇచ్చి..పెట్ డాగ్‌ని కిడ్నాప్ చేశాడు!
Follow us

|

Updated on: Oct 10, 2019 | 7:43 PM

ప్రస్తుతం ఇంట్లో ఉంటే చాలు..ప్రతిది ఆన్‌లైన్ డెలివరీ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. దీని వల్ల చాలా టైం సేవ్ అవుతుందన్న విషయం పక్కనపెడితే కొన్ని వింత సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఓ కస్టమర్‌కు ఆహారాన్ని డెలవరీ చేసిన జొమాటో డెలవరీ బాయ్.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడు. పుణెకు చెందిన వందన షా సోమవారం జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. తుషార్ అనే యువకుడు దాన్ని డెలవరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె పెంపుడు కుక్క ‘దొత్తు’ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికినా కూడా ఫలితం లేకపోయింది. అనంతరం సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోను చూడగా.. అందులో కుక్క ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందో కనిపించలేదు.

దీంతో ఆమె ఇరుగుపొరుగు ఇళ్ల వారిని  అడగగా జొమాటో డెలవరీ బాయ్ దాన్ని తీసుకెళ్లడం చూశామన్నారు. దీంతో వందన ట్విట్టర్ ద్వారా జొమాటోకు ఫిర్యాదు చేసింది. తుషార్ అనే డెలవరీ బాయ్ తన పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడని తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌‌లో కూడా కేసు పెట్టింది. జొమాటో నుంచి వచ్చిన మెసేజ్‌లో గల తుషార్ ఫోన్ నెంబరుకు కూడా ఆమె కాల్ చేసింది.

అయితే.. తాను కుక్కను తీసుకెళ్లలేదని.. తన వెంట వచ్చిందని.. ముద్దుగా ఉంటే వెంట తీసుకెళ్లినట్లు చెప్పారు. తాము పెంచుకునే కుక్క అని.. దాన్ని తిరిగి ఇవ్వాలని.. కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పినా సదరు డెలివరీ బాయ్‌ను తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. సంబంధం లేని మాటలు చెబుతూ.. ఆ కుక్కను తమ ఊరికి పంపినట్లు చెప్పారు.

దీంతో.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతోఈ ఉదంతం వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ పేరు తుషార్ గా తేల్చారు. ఈ అంశంపైజొమాటో కూడా రియాక్ట్ అయ్యింది. డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని చెబుతూ.. అతడి కోసం వెతుకుతున్నారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే