ఎలా జరిగింది..? ఆ బిస్కెట్ల కంపెనీపై అధికారుల దాడులు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముగ్గురు పిల్లలను బలి తీసుకున్న రోజ్‌ బిస్కెట్స్‌ తయారీ కేంద్రంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న కంపెనీలో బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించారు. ఇప్పటికే బిస్కెట్ల తయారీ..

  • Sanjay Kasula
  • Publish Date - 5:09 pm, Thu, 17 September 20
ఎలా జరిగింది..? ఆ బిస్కెట్ల కంపెనీపై అధికారుల దాడులు

వాళ్లు ముగ్గురే కాదు.. చాలామంది బిస్కట్లు కొనుకున్నారు. తిన్నారు. కానీ చనిపోయింది మాత్రం ఆ ముగ్గురే. బిస్కెట్ల తయారీ కంపెనీ కూడా తప్పు ఎక్కడ జరిగిందో తెలీదు అంటోంది. అసలు అంతమంది బిస్కట్లు తింటే.. ముగ్గురు పిల్లలే ఎలా చనిపోయారు. అంటే అది బిస్కట్ల ప్రభావమా.. లేదంటే ఆ పిల్లలే టార్గెట్‌గా ఇంకా ఏమైనా జరిగిందా.. ! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముగ్గురు పిల్లల మరణాల వెనుక కొత్తగా బలపడుతున్న అనుమానం.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముగ్గురు పిల్లలను బలి తీసుకున్న రోజ్‌ బిస్కెట్స్‌ తయారీ కేంద్రంపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న కంపెనీలో బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించారు. ఇప్పటికే బిస్కెట్ల తయారీ యూనిట్‌ను మూసివేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు నివేదిక వచ్చిన తర్వాతే తెరుస్తామంటున్నారు. బిస్కెట్లు తిని పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కావడం లేదంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇప్పటికే మార్కెట్‌ నుంచి ఆ బ్యాచ్‌ బిస్కెట్లను వెనక్కి రప్పించేందుకు ఆదేశాలిచ్చామన్నారు.