హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లైఓవర్స్‌, రింగ్‌రోడ్స్ క్లోజ్.. కారణమిదే!

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఫ్లైవోర్స్‌, ఔటర్‌ రింగ్ రోడ్డులు, మిగతా సబ్‌వేలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాదీ పోలీసులు. ఈ రూల్స్ ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రేపు తెల్లవారుఝామున 5 గంటల వరకూ అమల్లో ఉండనున్నాయి. న్యూఇయర్ సందర్భంగా వాహనదారులకు పోలీసులు పలు షాక్‌‌లు ఇస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా చేపట్టారు. అలాగే న్యూఇయర్ […]

హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లైఓవర్స్‌, రింగ్‌రోడ్స్ క్లోజ్.. కారణమిదే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 31, 2019 | 11:23 AM

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఫ్లైవోర్స్‌, ఔటర్‌ రింగ్ రోడ్డులు, మిగతా సబ్‌వేలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాదీ పోలీసులు. ఈ రూల్స్ ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రేపు తెల్లవారుఝామున 5 గంటల వరకూ అమల్లో ఉండనున్నాయి. న్యూఇయర్ సందర్భంగా వాహనదారులకు పోలీసులు పలు షాక్‌‌లు ఇస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా చేపట్టారు. అలాగే న్యూఇయర్ పార్టీలకు.. అర్థరాత్రి 12.30 వరకూ సమయాన్ని ఇచ్చారు పోలీసులు. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలోనూ జారీ చేసిన ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి.

న్యూఇయర్ సందర్భంలో.. ఔటర్‌ రింగ్ రోడ్డుపై లైట్ మోటార్ వెహికల్స్‌ ఎంట్రీకి నో చెప్పారు పోలీసులు. అంటే రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకూ.. కార్లు, జీప్‌లు, ఆటోలు సహా తేలికపాటి ప్యాసింజర్ వాహనాలేవీ ఔటర్ ఎక్కే పరిస్థితి లేదు. లారీలు, ఇతర వాహనాలకు మాత్రమే పర్మిట్ ఉంటుంది.

ఇక PV ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఇవే ఆంక్షలు అమలవుతాయి. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 వరకు కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వెహికిల్స్‌కి మాత్రమే గ్నీన్‌ సిగ్నల్ ఉంటుంది. అదికూడా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నట్లు ముందుగా రుజువు చేసుకోవాలి. ఇక సిటీ పరిధిలో గచ్చిబౌలీ, బయోడైవర్శిటీ, సైబర్‌ టవర్స్‌, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్లు న్యూ ఇయర్‌కు ఒక గంట మందు నుంచే మూసివేస్తారు. ఇటు అదే టైమ్‌కి ఎల్బీనగర్‌లో కామినేని ఆస్పత్రి ఫ్లైఓవర్‌, చింతల్‌కుంట అండర్‌పాస్‌లు క్లోజ్ అవుతాయి. సిటీలోని నల్గొండ చౌరస్తాలోని ఫ్లైఓవర్‌ తోపాటుపంజాగుట్టలోని ఫ్లైఓవర్‌ను అర్థరాత్రి క్లోజ్ చేసేస్తారు.

ఇంతా చేసినా కంట్రోల్‌ తప్పి రెచ్చిపోయే వాళ్లు ఉంటారు కాబట్టి.. తాటతీయడానికి పోలీస్‌ స్పెషల్‌ టీమ్‌లు రంగంలోకి దిగబోతున్నాయి. వెహికిల్స్ స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి సిటీలో వందలాది చెకింగ్‌ పాయింట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మద్యం సేవించి వాహనాలు నడిపేవాళ్ల భరతం పట్టేందుకు.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.